బోయపాటితోనా.. కొంచెం చూస్కో నానా
బోయపాటి కొత్త సినిమా ‘జయ జానకి నాయక’ రెండు వారాల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్లో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా మొదలుపెడతానని బోయపాటి ఇప్పటికే ప్రకటించాడు. మరి రాబోయే పది నెలల్లో బోయపాటి ఏం చేస్తాడన్న ప్రశ్న మొదలైంది. ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ లాగా కాకుండా తన స్థాయికి తగ్గ స్టార్ హీరోతోనే సినిమా చేయాలనుకుంటున్నాడతను. ఐతే బోయపాటికి డేట్లిచ్చే హీరో ఎవరన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే చాలామంది స్టార్ హీరోలు ఆల్రెడీ వేరే ప్రాజెక్టుల్లో లాక్ అయిపోయి ఉన్నారు. అక్కినేని అఖిల్ తో బోయపాటి తర్వాతి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారాన్ని నాగార్జున ఖండించాడు. ఐతే ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ మీదికి మళ్లింది. ఇంకో నెలా నెలన్నరలో ‘రంగస్థలం’ పూర్తి చేసి చరణ్ ఖాళీ అయిపోతాడు.
ఈ నేపథ్యంలో చరణ్ బోయపాటితో సినిమా చేయొచ్చన్న ప్రచారం మొదలైంది. కొందరైతే ఈ కాంబినేషన్ పక్కా అనేస్తున్నారు. ఐతే చరణ్ ఇప్పుడు బోయపాటితో పని చేయడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తోంది. ఒక దశలో వరుసగా మాస్ మసాలా సినిమాలు చేయడం ద్వారా జనాలకు మొహం మొత్తేలా చేశాడు చరణ్. చివరికి ‘బ్రూస్ లీ’తో గట్టి ఎదురు దెబ్బ తిని.. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలపై దృష్టి పెట్టాడు. ‘ధృవ’ అతడిని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. దీని తర్వాత సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో మరో వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు చరణ్. ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు.. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేస్తూ తనకు ఇంతకుముందు పట్టు లేని క్లాస్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించే ప్రయత్నంలో ఉన్న చరణ్.. బోయపాటితో మళ్లీ పాత స్టయిల్లో మాస్ సినిమా చేయడం అవసరమా అంటున్నారు కొంతమంది. ‘జయ జానకి నాయక’ ఆడుతుండొచ్చు కానీ.. ఒకే తరహా సినిమాలతో బోయపాటి మొహం మొత్తించేస్తున్న మాట మాత్రం వాస్తవం. కాబట్టి చరణ్ కొంచెం ముందు వెనుక చూసుకుంటే బెటరేమో.