సెట్స్ లో చరణ్ సరదాగా..

Update: 2018-01-09 17:09 GMT
రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న రంగస్థలం సినిమాపై ప్రస్తుతం ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. టాలీవూడ్ లో ప్రస్తుతం చాలా కొత్తగా తెరకెక్కుతోన్న చిత్రం ఏదైనా ఉందా అంటే ఇదొక్కటే అని చెప్పాలి. ప్రయోగాల దర్శకుడు సుకుమార్ మొదటి సారి కన్ఫ్యూజన్ చేయకుండా చాలా క్లారిటీతో సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పటి నుంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

అంతే కాకుండా మంచి మనసున్న హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సెట్స్ దగ్గరికి ఏ అభిమానులు వస్తున్నా కూడా తనదైన శైలిలో కలుస్తున్నాడు. అయితే చాలా మంది హీరోలు సహచరు నటి నటులతో ఈక్వల్ గా ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే అలాంటి వారిలో చరణ్ కూడా చేరిపోయాడని ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే సినిమాలో నటిస్తోన్న కొంత మంది కామెడియన్స్ తో చాలా సరదాగా ఉన్న ఒక వీడియో రీసెంట్ గా బయటపడింది.

సెట్స్ లో జబర్దస్త్ కమెడియన్స్ సరదాగా ఒక స్టంట్ చేయడం అందుకు చరణ్ సలహాలు ఇవ్వడం చాలా సరదాగా అనిపించింది. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే..దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో చివరి షెడ్యూల్ ని పూర్తి చేసి సాంగ్స్ ని షూట్ చేస్తారట. ఇక ఆ తరువాత క్యారెక్టర్స్ టీజర్స్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చ్ లో రాబోతోన్న సంగతి తెలిసిందే.

Full View
Tags:    

Similar News