• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ సినిమాలో తండ్రీ...

శంకర్ సినిమాలో తండ్రీ కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయం?

By - Tupaki Desk
Update: 2021-10-07 04:30 GMT
శంకర్ ఒక కథను అల్లుకునే విధానం .. ఆ కథలోని పాత్రలను మలిచే తీరు కొత్తగా ఉంటాయి. శంకర్ కథల్లో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటుంది. అది అత్యంత ఆసక్తికరంగా ఉంటూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక భారీతనం .. భారీ తారాగణం ఆయన కథల భుజంపై చెరో చేయి వేసి నడిపిస్తాయి. అలాంటి శంకర్ మొదటిసారిగా తెలుగులో చరణ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవలే లాంఛనంగా మొదలైంది.

నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా అయితే, హీరోగా చరణ్ కి 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానిని తీసుకున్నారు. ఈ నెల రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. పూణేలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో ఫస్టు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అక్కడ జరిగే యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నవంబర్ ఫస్టు వీక్ లో కియారా అద్వాని ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. తండ్రీ కొడుకులుగా ఆయన ఈ  సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం .. ఆ పాత్రలను శంకర్ డిజైన్ చేసిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతవరకూ ఉందనేది మాత్రం తెలియదు. అధికారికంగా వెల్లడించే వరకూ ఇది ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ గా మాత్రమే చెప్పుకోవలసి ఉంటుంది.
ఇక ఈ సినిమాలో కొత్త మీసకట్టుతో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు.

చరణ్ తో కలిసి కియారా అద్వాని నటించడం ఇది రెండవసారి. 'వినయ విధేయ రామ'  సినిమాలో ఆమె మొదటిసారిగా చరణ్ తో కలిసి సందడి చేసింది. ఆ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. కానీ సినిమా పరాజయం పాలుకావడం వలన, ఆమె అందచందాలకు ఆశించినస్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ ఏ స్థాయిలో రెచ్చిపోతుందో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ భామ దూకుడు ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమా హిట్ అయితే ఇక అన్ని  చోట్లా ఆమె అందాల సందడి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒక హీరోకి ఎలాంటి క్రేజ్ ఉంది? ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఆ హీరో ఏ రేంజ్ లో డాన్స్ చేయగలడు? ఆయన నుంచి అభిమానులు ఆశించేదేమిటి? అనే విషయాలను తమన్ దృష్టిలో పెట్టుకుని పాటలు కంపోజ్ చేస్తుంటాడు. ఆయన సక్సెస్ సీక్రెట్ ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇది శంకర్ సినిమా అనేసరికి కూడా ప్రేక్షకుల్లో ఒక స్థాయి అంచనాలు ఉంటాయి. అందువలన తమన్ మరింత దృష్టి పెట్టేసి బాణీలు కడుతున్నాడు. సునీల్ .. శ్రీకాంత్ .. అంజలి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, మున్ముందు ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.  
Tags:    
  • ramcharan 
  • rc15 
  • shankar 
  • kiara advani 
  • dilraju 
  • rc15 budget 
  • acharya movie 
  • RRR movie 
  • ramcharan rc15 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS