బాసుతో బాక్స్ బద్దలు కొట్టించే ప్లాన్..!

Update: 2018-12-13 12:19 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'సైరా' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాకమునుపే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు పచ్చ జండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చాలా రోజుల నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.  ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ అంటేనే ఒక క్రేజీ ప్రాజెక్ట్.  దీన్ని మరింత క్రేజీగా మార్చే ప్రణాళికలు రచించాడట కొరటాల. ఈ సినిమా లో ఒక కీలకమైన పాత్ర ఉందట.  ఈ పాత్రను చరణ్ ను మనసులోపెట్టుకొని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగిందట. ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదుగానీ క్యామియో అనుకోవచ్చు.  అంటే.. కొరటాల తండ్రీ కొడుకుల కాంబో సెట్ చేసినట్టే. చిరు - చరణ్ లు గతం లో ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియో చేయడమ జరిగింది కానీ అది జస్ట్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేందుకు మాత్రమే. ఇలా ఒకరి సినిమాలో మరొకరు కీలక పాత్ర పోషించడం మాత్రం ఇదే మొదటిసారి. 

ఈ సినిమాను త్వరలోనే మొదలు పెట్టేందుకు కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నాడట. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తారు. ఇప్పటివరకూ కొరటాల శివ ఏ స్టార్ హీరో తో చేసినా వారికి కెరీర్ బెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అందించాడు. అదే సెంటిమెంట్ రిపీట్ అయితే బాసుతో బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించడం పక్కానే.
Tags:    

Similar News