అబ్బో.. మహేష్‌ పార్టీలో కూడా చరణే

Update: 2017-01-23 07:00 GMT
రైవల్స్ అనే పదం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ దిశగా ఎదుగుతున్న ఫిలిం స్టార్లు చాలామందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అసలు సూపర్ స్టార్ మహేష్ అండ్ మెగా పవర్ స్టార్ చరణ్ స్నేహం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. మొన్ననే ఇద్దరూ కలసి స్విట్జర్ ల్యాండ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మహేష్‌ వైఫ్‌ నమ్రతా శిరోద్కర్ అండ్ చెర్రీ వైఫ్‌ ఉపాసన కామినేని కూడా కొత్త స్నేహం మొదలెట్టేశారు. అయితే ఇదేదో కాకతాళీయంగా జరిగిన మీట్ అనుకుంటే మాత్రం.. కాదు ఇదో కొత్త స్నేహానికి తొలిమెట్టు అన పంథాలో సాగుతున్నారు వీరు.

నిన్న హైదరాబాద్ లో నమ్రత బర్త్ డే సెలబ్రేషన్లు కాస్త గాట్టిగానే జరిగాయ్. తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న నమ్రత.. ఈ పార్టీకి తన క్లోజ్ ఫ్రెండ్స్ ను.. అలాగే మహేష్‌ సిస్టర్ మంజులను.. ఇక ఉపాసనను పిలిచింది. ఈ పార్టీకి మహేష్‌ అండ్ చరణ్‌ కూడా యథావిథిగా సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్ అయిపోయారని టాక్. అయితే వీరిద్దరూ కలసి ఫోటోలు పెడితే మరీ ఓవర్ గా ఉంటుందని డ్రాప్ అయిపోగా.. నమ్రత అండ్ ఉపాసన మాత్రం తమ ఫోటోలతో చెప్పాల్సిన మెసేజ్ చెప్పేశారు. ఫ్రెండ్స్ ఫరెవర్ అన్న పంథాలో దూసుకుపోయారు. మొత్తానికి మహేష్‌ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పార్టీలో కూడా చరణ్ అండ్ ఫ్యామిలీ ఇలా సందడి చేయడం.. ఒక గుడ్ సైన్ అనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News