బాగున్నావా... బాలయ్య-చరణ్ వీడియో వైరల్

శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన వారు హాజరు అయ్యారు. ఆ సమయంలోనే రామ్ చరణ్ దంపతులు రిసెప్షన్ కు హాజరు అయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ కి శర్వా అత్యంత సన్నిహితుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
శర్వాతో ఫోటో దిగిన తర్వాత చరణ్ కొద్ది సమయం సరదాగా ముచ్చటించాడు. అదే సమయంలో శర్మ మెడకు ఉన్న టై ని సర్ది అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ను చూసి వినమ్రంగా నమస్కరించడం జరిగింది. అప్పుడే బాలయ్య బాగున్నావా అని అడగడం కూడా జరిగింది.
బాలకృష్ణ బాగున్నావా అంటూ ప్రశ్నించడంతో బాగున్నాను అంటూ చరణ్ సమాధానం చెప్పాడు. అప్పుడే చరణ్ వీపుపై చిన్నగా కొట్టి బాలయ్య అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రామ్ చరణ్ సతీసమేతంగా హాజరు అయ్యి కార్యక్రమం యొక్క వెయిట్ పెంచాడు అనడంలో సందేహం లేదు. బాలయ్య కూడా హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక వీరిద్దరూ కలిసి నవ్వుకుంటూ ముచ్చటించడం అంతకు మించి అన్నట్లుగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నేడు బాలయ్య పుట్టిన రోజు అవ్వడంతో సోషల్ మీడియాలో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.
Full View