ఇంకా లోకేష్ ని నమ్ముతున్నాడా?
'ఖైదీ', 'విక్రమ్' లాంటి హిట్స్ తో లోకేష్ కనగరాజ్ సౌత్ లో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు.;
`ఖైదీ`, `విక్రమ్` లాంటి హిట్స్ తో లోకేష్ కనగరాజ్ సౌత్ లో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు విజయాలు లోకేష్ ని కోలీవుడ్ సూపర్ డైరెక్టర్ల సరసన కూర్చోబెట్టాయి. అతడి పేరిట ఎల్ సీయూ ను క్రియేట్ చేసాడు. దీంతో కోలీవుడ్ స్టార్ హీరోలంతా అతడితో పని చేయాలని ఆశపడ్డారు. టాలీవుడ్ హీరోలు సైతం క్యూలో నిలిచారు. అదే సమయంలో దళపతి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ అవకాశాలిచ్చారు. విజయ్ తో `లియో`, రజనీకాంత్ తో `కూలీ` తెరకెక్కించాడు. ఈరెండు భారీ వసూళ్లనే సాధించాయి.
కానీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సినిమాల్లో తన మార్క్ ఎక్కడా కనిపించలేదని..రోటీన్ కథలతోనే చేసాడనే నెగిటివ్ టాక్ సౌత్ లో అంతకంతకు విస్తరించింది. దీంతో లోకేష్ ఇమేజ్ పై కొంత ప్రభావం పడినట్లు కనిపించింది. లోకేష్ విజయాలు చూసే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా అతడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అమీర్ ఆసక్తిని గమనించి లోకేష్ తనతో సినిమా కంటే ముందుగా? `కూలీ` గెస్ట్ అప్పిరియన్స్ గా అమీర్ ను దించాడు. కానీ `కూలీ` వైఫల్యం సహా, అమీర్ పాత్రలో ఏమంత కిక్ లేదని ప్రేక్షకులు పెదవి విరిచేసారు.
అలాంటి పాత్ర అమీర్ ఖాన్ చేయడం ఏంటనే? విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అమీర్ ఖాన్ కూడా లోకేష్ తో పని చేయాలి? అన్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో లోకేష్ కోలీవుడ్ లో హీరోగానూ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. డైరెక్టర్ గా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లన్నీ పక్కన బెట్టి అప్పటికప్పుడు హీరోగా నటించడం? ఏంటి అన్నది లోకేష్ పై మరింత నెగివిటీ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో లోకేష్ డైరెక్టర్ గా రిటైర్మెంట్ ఇచ్చి నటుడిగా కొనసాగుతాడా? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
దీంతో అమీర్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇలా ఎంత నెగిటివిటీ వచ్చినా మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదని తాజా ప్రకటనతో తేలిపోయింది. లోకేష్ తో సినిమా చేస్తున్నట్లు మరోసారి ప్రకటించాడు. ఇరువురు గత నెలలోనే ముంబైలో కలవాల్సి ఉందని, కానీ బిజీ షెడ్యూల్ కారణంగా వీలు పడలేదన్నారు. దీంతో ఆ కాంబోలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని తేలిపోయింది.
అయితే లోకేష్ పరాజయాలు, అతడిపై ఉన్న నెగివిటీ తీవ్ర స్థాయిలో ఉన్నా? ఇప్పటికీ అమీర్ ఖాన్ లోకేష్ ని నమ్మి ముందుకెళ్లడం ఆసక్తికరం. ప్రస్తుతం అమీర్ ఖాన్ కూడా ప్లాప్ ల్లోనే ఉన్నాడు. `దంగల్` తర్వాత సరైన సక్సస్ పడలేదు. ఆ తర్వాత నటించి న సినిమాలన్నీ ప్లాప్ చిత్రాలే. కొన్ని సినిమాలు తానే స్వీయా దర్శకత్వంలోనూ నిర్మించి నష్టాలు చూసారు. దీంతో అమీర్ ఖాన్ కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ లోకేష్ విషయంలో మాత్రం కాన్నపిడెంట్ గానే ఉన్నారు.