సమంత.. పేరు కహానీ నిజమేనా?
స్టార్ హీరోయిన్ సమంత.. రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.;
స్టార్ హీరోయిన్ సమంత.. రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వారిద్దరూ.. ఇటీవల వివాహ బంధంతో ఒకటయ్యారు. కానీ అంతకుముందు అఫీషియల్ గా తమ రిలేషన్ ను అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో హింట్స్ ఇచ్చారు.
దీంతో రకరకాల వార్తలు వచ్చినా స్పందించని వారిద్దరూ.. అంతా అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో.. భూత శుద్ది పద్దతిలో వారి వివాహం జరిగింది. మ్యారేజ్ అయ్యాక ఆ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడిస్తూ.. సమంత కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి వెల్లడించారు.
అయితే సామ్ పెళ్లి తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ లో బిజీ అయిపోయారు. తాను యాక్ట్ చేస్తూ.. నిర్మిస్తున్న మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత వెంటనే హనీమూన్ అని బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ లో పాల్గొనడంతో.. ఆమెను అంతా పొగిడేస్తున్నారు. సమంత వర్క్ డెడికేషన్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అదే సమయంలో ఆమె పేరు మార్పు కోసం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి సామ్.. సమంత రూత్ ప్రభుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకుని అదే బ్రాండ్ తో కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఆమె.. తన పేరును మార్చుకున్నారు.
సమంత అక్కినేనిగా మార్చుకోగా.. అంతా ప్రశంసలు కురిపించారు. కానీ కొన్నేళ్లకే విడాకులు తీసుకోవడం వల్ల.. మళ్లీ అప్పటి నుంచి పాత పేరునే కంటిన్యూ చేశారు. సమంత రూత్ ప్రభుగానే తన బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లారు. కట్ చేస్తే.. ఇప్పుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. దీంతో పేరు మార్పు విషయంపై చర్చ మొదలైంది.
త్వరలో సమంత నిడిమోరుగా పేరు మార్చుకుంటారని కొన్నిరోజులుగా కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు తన నేమ్ ను ఛేంజ్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సమంత రూత్ ప్రభుగా ప్రస్తుతం తన బ్రాండ్ ను కొనసాగిస్తున్న సామ్.. ఇకపై కేవలం సమంతగానే పేరును కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అసలు నిజం ఏంటో తెలియాల్సి ఉంది.