ర‌కుల్ ఇంత సాహ‌సం అవ‌స‌ర‌మా?

Update: 2019-09-27 15:25 GMT
ర‌కుల్ ప్రీత్ సింగ్ చురుకైన‌ ప్లానింగ్స్ గురించి తెలిసిందే. సినిమాలు.. బిజినెస్.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇలా అన్నిటినీ ఈజీగా మ్యానేజ్ చేసేస్తుంటుంది. ఈ వ్యాప‌కాల‌న్నీ ఓ వైపు.. అభిమానులు గెస్ చేయ‌లేని వేప‌కాయంత వెర్రి ఇంకో వైపు.. ఆ వెర్రేంటి అన్న‌ది తెలియాలంటే మ్యాట‌ర్ లోకి వెళ్లాలి.

ర‌కుల్ నిరంత‌రం ఫిట్ నెస్ ఫ్రీక్ గా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. నిత్యం త‌న వ‌ర్క‌వుట్ల వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మ‌న్మ‌ధుడు 2 స‌మ‌యంలోనూ నాగార్జున‌తో పోటీప‌డుతూ వ‌ర్క‌వుట్లు చేసి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాల జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా నీ వేప‌కాయంత వెర్రిని మాత్రం వ‌దిలేట్టు లేదని అభిమానులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిట్ నెస్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించే ర‌కుల్ తాజాగా ఇన్‌ స్టాలో పోస్ట్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. ఈ వీడియోలో 175 పౌండ్ ల బ‌రువును వెయిట్ లిప్ట్ చేస్తూ క‌స‌ర‌త్తులు చేస్తున్న ర‌కుల్ అభిమానుల‌కు బిగ్ షాకిచ్చింది. వెయిట్ లిప్టింగ్ లో మ‌రో అటెంప్ట్ చేస్తున్నాను. ఈ ద‌ఫా 175 పౌండ్ ల బ‌రువు ని సునాయ‌సంగా ఎత్తేశాను` అని ఆ వీడియోకి క్యాప్ష‌న్‌ నిచ్చింది. దీనికి డెడ్‌ లిప్ట్‌- జిమ్ ల‌వ‌ర్‌.. స్ట్రాంగెస్ట్ సెక్సీ అనే హాష్ ట్యాగ్ ల‌ని జ‌త చేసింది. ఈ వీడియోలో ర‌కుల్ త‌న యాబ్స్ తో  అద‌ర‌గొట్టేసింద‌ని చెప్పాలి. ప‌సుపు వ‌ర్ణం స్పొర్ట్స్ బ్రాలో ర‌కుల్ క‌నిపిస్తున్న తీరు కిల్లింగ్ గా వుంది.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News