రూ. 400 కోట్ల ప్రాజెక్టుల‌నే నిర‌భ్యంత‌రంగా వ‌దులుకున్న హాట్ లేడీ! ఎందుకంటే?

దాదాపు దశాబ్ద కాలంగా భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న భూమి పడ్నేకర్ మరోసారి తన ఆలోచనలతో, నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-21 15:30 GMT

దాదాపు దశాబ్ద కాలంగా భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న భూమి పడ్నేకర్ మరోసారి తన ఆలోచనలతో, నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారింది. కమర్షియల్‌గా భారీ స్థాయిలో తెరకెక్కే ప్రాజెక్టులు వచ్చినా, తన సృజనాత్మక అభిరుచులకు సరిపోకపోతే వాటిని తిరస్కరించడంలో ఎలాంటి సందేహం చూపలేదని ఆమె తాజాగా వెల్లడించింది.

ఎన్నో న‌ష్టాలు ఎదుర్కొన్నా

తన కెరీర్‌లో ఎన్నో పాత్రల కోసం శారీరకంగా భారీ మార్పులు చేసిన భూమి, నటన పట్ల తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది. బరువు పెరగడం, తగ్గించడం వంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ ఆమెకు కొత్తేమీ కాదు. అయితే ఈ ప్రయాణంలో శారీరకంగా కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొన్నట్టు ఆమె చెప్పడం గమనార్హం. పాత్రలో పూర్తిగా లీనమవ్వాలంటే శరీరాన్ని మార్చుకోవడం తప్పనిసరి అవుతుందని, అదే తనకు నటిగా సంతృప్తిని ఇస్తుందని ఆమె స్పష్టం చేసింది.

ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా లేవ‌ని..

అయితే ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే ట్రెండ్‌కు భిన్నంగా, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో భూమి తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. రూ.300- రూ.400 కోట్ల వరకూ బడ్జెట్ ఉన్న నాలుగు పెద్ద ప్రాజెక్టులను కేవలం కథలు తన ఆలోచనలకు అనుగుణంగా లేకపోవడం వల్లే వదులుకున్నట్లు ఆమె వెల్లడించింది. సాధారణంగా ఇలాంటి అవకాశాలు రావడం అరుదు కావడంతో, నటీనటులు వాటిని అందుకోవడానికి ముందుంటారు. కానీ భూమి మాత్రం కంటెంట్‌కి ప్రాధాన్యం ఇస్తూ, తన సిద్ధాంతాలకే ప్రాముఖ్యత ఇచ్చిన తీరు పరిశ్రమలో చర్చకు దారి తీస్తోంది.

ఇక భవిష్యత్తులో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు భూమి చెప్పడం మరో విశేషం. కేవలం నటిగా కాకుండా కంటెంట్‌ను నిర్మించే దిశగా కూడా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఉందని ఆమె వెల్లడించింది. ఆధునిక కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతున్న AI వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ, తన నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు దాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నట్టు తెలిపింది.

తనకు ఎంతో ఇష్టమైన నటిగా ప్రియాంక చోప్రా పేరు ప్రస్తావిస్తూ, కెరీర్ విషయంలో ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని భూమి పేర్కొంది. అంతేకాకుండా, తన కెరీర్‌లో ఎదురైన వైఫల్యాల గురించి కూడా ఆమె ఓపెన్‌గా మాట్లాడింది. ముఖ్యంగా ది లేడీ కిల్లర్ సినిమా ఫ్లాప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని అంగీకరించింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత తన కెరీర్ ముగిసిపోయిందనిపించిందని, అది అసంపూర్ణంగా రిలీజ్ కావడం తనకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పింది. అయితే ఆ అనుభవాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకు సాగుతున్నట్టు భూమి స్పష్టం చేసింది. అవకాశాల కంటే తన విలువలు ముఖ్యమని నమ్ముతూ, భారీ ప్రాజెక్టులను కూడా నిరభ్యంతరంగా వదులుకునే ధైర్యం చూపుతున్న భూమి పడ్నేకర్.. ఇండస్ట్రీలో తనదైన మార్గాన్ని సృష్టించుకుంటున్న నటిగా మరింత బలంగా నిలుస్తోంది.

Tags:    

Similar News