వింటేజ్ సాంగ్ కు పవన్ డ్యాన్స్.. ఫుల్ ఎంజాయ్ చేసిన చిరు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. తాజాగా ఆ సినిమాను మెగా కుటుంబం ప్రత్యేకంగా వీక్షించింది.;

Update: 2026-03-21 18:37 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. తాజాగా ఆ సినిమాను మెగా కుటుంబం ప్రత్యేకంగా వీక్షించింది. హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొని చిత్రాన్ని ఆస్వాదించారు.

సినిమా పూర్తిగా చూసిన అనంతరం చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్రం ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ టేకింగ్ ఎంతో ఎనర్జిటిక్‌ గా ఉందని కొనియాడారు. పవన్ కల్యాణ్ పవర్‌ ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని అభివర్ణించారు. ఒక అన్నయ్యగా మాత్రమే కాకుండా, ఒక సినీ ప్రేక్షకుడిగా కూడా సినిమా తనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని తెలిపారు.

చిత్రంలోని పాటల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా స్పందించారు. తన కెరీర్‌ లో సూపర్ హిట్‌ గా నిలిచిన వాన వాన వెల్లువాయే పాటను సినిమాలో రీమిక్స్ చేసిన విధానం తనకు ఎంతో నచ్చిందన్నారు. ఆ సాంగ్‌ కు పవన్ కల్యాణ్ వేసిన స్టెప్పులు చూస్తూ ముచ్చటపడ్డానని చెప్పారు. అలాగే ఈ మనసే మెలోడీ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆ పాటల సమయంలో తాను పూర్తిగా ఎంజాయ్ చేశానని చిరంజీవి తెలిపారు.

అయితే చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలోని వాన వాన వెల్లువాయే సాంగ్ కు పవన్ డ్యాన్స్ చూసి మెగాస్టాార్ నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ స్ట్రీమింగ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలు, హీరోయిన్ శ్రీలీలతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ శ్రీలీల నటన కూడా ఎంతో బాగుందని చిరంజీవి అభినందించారు.

చిత్ర యూనిట్ కష్టానికి తగిన ఫలితం దక్కిందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారని పేర్కొన్నారు. సినిమా స్క్రీనింగ్ సందర్భంగా మెగా బ్రదర్స్ మధ్య ఆప్యాయత క్షణాలు కనిపించాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించి, ప్రేమగా హగ్ చేసుకోవడం మెగా అభిమానులను ఆకట్టుకుంది. సురేఖతో పవన్ సరదాగా మాట్లాడిన దృశ్యాలు కూడా అందరినీ ఆకర్షించాయి.

ఇక గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌ లో వచ్చిన ఆ చిత్రం పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పవన్ కల్యాణ్ భగత్ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించి, తనదైన మాస్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్‌ తో అభిమానులను అలరిస్తున్నారు. ఏదేమైనా మెగాస్టార్ ప్రశంసలతో మూవీ టీమ్ ఆనందంలో మునిగిపోయిందని చెప్పాలి.

Tags:    

Similar News