కియ‌రా పెళ్లి స‌రే ర‌కుల్ పెళ్లి తేదీ ఇదిగో

Update: 2022-10-13 13:32 GMT
తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది! అన్న చందంగా ఉంది బాలీవుడ్ లో ప్రేమ జంట‌ల‌ ప‌రిస్థితి. ముంబై ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్ల సీజ‌న్ చాలా ముందే మొద‌లైన‌ట్టుగా ఉంది. ఓవైపు కియ‌రా త‌న ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లాడేస్తోందంటూ పుకార్లు షికార్ చేస్తుంటే ఇంత‌లోనే ఎట్నుంచి పుట్టుకొచ్చిందో ఇదిగో ర‌కుల్ ప్రీత్ పెళ్లి కూడా ఖ‌రారైందంటూ గుస‌గుస‌లు మొద‌లైపోయాయి.

నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్ - నిర్మాత‌ జాకీ భగ్నాని సోషల్ మీడియాలో త‌మ అనుబంధంపై అధికారికంగా ప్ర‌క‌టించారు. ఒక అంద‌మైన‌ రొమాంటిక్ ఫోటోని షేర్ చేసి తమ సంబంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఇద్దరూ తమ వృత్తిపరమైన  బిజీ షెడ్యూళ్ల‌తో ఉండగా ఈ జంట‌ వివాహం గురించిన చాలా కాలంగా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

డాక్టర్ జి ప్ర‌మోష‌న్స్ లోనూ ర‌కుల్ పెళ్లి గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. దీంతో ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న చందంగా ర‌కుల్ పెళ్లి వార్త‌లు వైర‌ల్ గా మారుతున్నాయి. ఇటీవల తన  బాయ్ ఫ్రెండ్ జాకీతో పెళ్లి తేదీ ఫిక్స‌య్యిందంటూ లీక్ అందించిన మీడియాల‌కు ర‌కుల్ ఇప్పుడు బిగ్ కౌంట‌ర్ వేసింది. తాజాగా తన సోదరుడు కాబోయే హీరో అమన్ ప్రీత్ సింగ్ తో క‌లిసి ర‌కుల్ చాలా కామెడీలు చేసింది.

జాకీ భగ్నానితో తన పెళ్లి నిజ‌మేన‌ని అమ‌న్ ప్రీత్ ధృవీకరించినట్టు క‌థ‌నం వేసిన‌ మీడియా ను ఎగతాళి చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ విరుచుకుపడింది. సోదరుడు అమన్ ప్రీత్ పై న‌వ్వులు చిందిస్తూనే ర‌కుల్ గుస్సాయించింది. పెళ్లి వివరాలను లీక్ చేసినందుకు తన సోదరుడు అమన్ ప్రీత్ పై కోప్ప‌డుతూ ముసిముసిగా న‌వ్వేస్తూ ఉన్న‌ ఫోటోల బంచ్ కూడా ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

జాకీతో తన వివాహాన్ని ఆమె సోదరుడు అమన్ ధృవీకరించారని ప్ర‌ముఖ జాతీయ ప‌త్రిక ఒక క‌థ‌నం ప్ర‌చురించ‌గా దానిని ఉటంకిస్తూ.. రకుల్ నవ్వుతూనే చుర‌క‌లు వేసింది. @AmanPreetOffl మీరు ధృవీకరించారా? ఔర్ ముఝే బటాయా భీ నహీ బ్రో... ఇది జీవితం! అని వ్యాఖ్యానించ‌గా.. దానికి అమన్ స్పందిస్తూ .. ???? నేను ధృవీకరించాన‌ని నాక్కూడా ఇప్పుడే తెలిసింది! అంటూ పంచ్ వేసాడు. మొత్తానికి త‌న సోద‌రుడితో క‌లిసి ప్రియ‌మైన ర‌కుల్ మీడియాల‌పై పంచ్ లు వేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రకుల్- జాకీ ఇద్దరూ వివాహ వ్యవస్థను విశ్వసిస్తున్నందున 2023 లో వివాహం చేసుకోబోతున్నార‌ని స‌ద‌రు మీడియా క‌థ‌నంలో ప్ర‌చురించింది. పెళ్లి స్పష్టంగా కార్డు(శుభ‌లేఖ‌)ల ద‌శ‌కు చేరుకుందని అయితే ప్రస్తుతానికి ఇంకా ఏదీ వంద‌శాతం క్లారిటీగా లేద‌ని అమన్ లీకులిచ్చిన‌ట్టు ఆ క‌థ‌నం పేర్కొంది. రకుల్ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తుందని.. ప్రస్తుతం తన సోదరి ఆమె ప్రియుడు ఇద్దరూ తమ వ‌ర్క్ క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నారని ఆయన తెలిపిన‌ట్టు క‌థ‌నం వెలువ‌రించింది. దీనిపైనే సోద‌ర‌సోద‌రీమ‌ణులు పంచ్ లు విసిరారు.

జాకీతో తన సంబంధాన్ని ఎందుకు దాచ‌కూడ‌ద‌ని భావించిందో ర‌కుల్ కొన్ని నెలల కింద‌టే స్ప‌ష్ఠంగా వెల్ల‌డించింది. ఏ మ‌నిషికైనా రిలేష‌న్ షిప్ అనేది అత్యంత సహజమైన ప్ర‌క్రియ అని.. దానిని దాచిపెట్టి ``మేము మంచి స్నేహితులు మాత్రమే`` అని చెప్పుకోవడానికి ఇష్టపడన‌ని ర‌కుల్ సూటిగా ఉన్న విష‌యం చెప్పేసింది. అయితే తన రిలేషన్ షిప్ చర్చనీయాంశం కావడం తనకు ఇష్టం లేదని కూడా మీడియాకు చెప్పింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రకుల్ చివరిసారిగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన `కట్ పుట్లి`లో కనిపించింది. త‌దుప‌రి ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జి విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ జి ట్రైలర్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. స్త్రీ రోగులతో మగ గైనకాలజిస్ట్ కి ఎదుర‌య్యే స‌వాళ్లు ఏమిట‌న్న‌దే ఈ సినిమా. గైన‌కాల‌జిస్టుగా ఆయుష్మాన్ పాత్ర ఎలా కష్టపడుతుందనేది తెర‌పై చూపించారు. డాక్టర్ G అనేది మెడికల్ క్యాంపస్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆస‌క్తిక‌ర కామెడీ డ్రామా. ఈ చిత్రంలో ఆయుష్మాన్ సీనియర్ గా  రకుల్ ప్రీత్ సింగ్ న‌టించారు. ఆయుష్ కి తల్లి పాత్రలో షీబా చద్దా నటించారు. అనుభవి కశ్యప్ దర్శకత్వం వహించారు. మెడికల్ కాలేజీ కోఆర్డినేటర్ గా షెఫాలీ షా..న‌టించారు. త్వ‌ర‌లో మూవీ విడుద‌ల కానుంది.
Tags:    

Similar News