రకుల్‌ పనైపోయింది అనే వారికి ఇదే సమాధానం

Update: 2021-08-24 12:30 GMT
టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలందరితో సినిమాలు చేసిన హీరోయిన్స్‌ అతి తక్కువ మంది ఉంటారు. వారిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఉంటుంది. మహేష్‌ బాబు.. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌.. అల్లు అర్జున్‌ ఇంకా పలువురు హీరోలతో సినిమాలు చేసి ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు ఆఫర్లు తగ్గాయి.. ఈమద్య కాలంలో ఆమె పనై పోయింది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారిక సమాధానం అన్నట్లుగా రకుల్‌ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉంది.

ఒకప్పుడు కేవలం తెలుగులో మాత్రమే నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా నటిస్తోంది. ఆమె నటిగా ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్ రెగ్యులర్ గా ఏదో ఒకటి వస్తూనే ఉంది. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లు ప్రత్యేక షో లు ఐటెం సాంగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఒక్క రోజు ఖాళీ లేకుండా బిజీ బిజీగానే సినిమాలు చేస్తోంది. తాజాగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌ లకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.

తెలుగు మరియు తమిళంలో ఒకే సారి రూపొందబోతున్న రెండు పెద్ద సినిమాలకు ఓకే చెప్పింది. అక్టోబర్‌ చివర్లో ఈ ప్రాజెక్ట్‌ లు పట్టాలెక్కబోతున్నాయి. ఆ రెంటిలో ఒకదానికి లేడీస్ నైట్‌ కాగా మరో ప్రాజెక్ట్‌ కు ఇంకా టైటిల్‌ ను ఖరారు చేయలేదు. ఈ రెండు ప్రాజెక్ట్‌ లు మాత్రమే కాకుండా పలు సినిమాల్లో ఈమె నటిస్తుంది. అంతే కాకుండా ఈమె నటించిన కొండ పొలం ఇంకా ఇతర భాషల సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మొత్తానికి రాబోయే రెండు మూడు ఏళ్ల వరకు కూడా రకుల్‌ ఫుల్‌ బిజీగానే ఉంటుంది. ఈ సినిమాలే రకుల్‌ పనైపోయింది అంటూ ప్రచారం చేస్తున్న వారికి సమాధానం అంటూ రకుల్‌ అభిమానులు సగర్వంగా కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News