ఫోటో స్టొరీ: అదిరేటి స్టైల్ లో రకుల్ ర్యాంప్ వాక్

Update: 2019-03-31 06:35 GMT
రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య తెలుగు అవకాశాలు తగ్గాయని ఇప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం కష్టమేనని వార్తలు వినిపించాయి కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ నాగార్జున లేటెస్ట్ ఫిలిం 'మన్మధుడు 2' లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.  అంతే కాదు ఈ సినిమాకు డబల్ ఫీజు తీసుకుంటోందని కూడా వార్తలు గుప్పుమన్నాయి.  రెండు సినిమాలకు తీసుకునే ఫీజును ఒకే సినిమాకు తీసుకోవడం అంటే ఫుల్ డిమాండ్ ఉన్నట్టే.

ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2019 లో తళుక్కున మెరిసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నరేంద్ర కుమార్ అహమద్ డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసింది.  లెఫ్ట్ సైడ్ స్లిట్ ఉండే నీలం రంగు డ్రెస్ లో హొయలొలికిస్తూ ర్యాంప్ వాక్ చేయడంతో అక్కడున్నవారు ముగ్ధులైపోయారు.  రెగ్యులర్ గా కసరత్తులు చేస్తూ స్లిమ్ గా ఉండే బ్యూటీ కావడం.. పైగా హీరోయిన్ గా మారక ముందు మోడలింగ్ రంగంలో అనుభవం ఉండడంతో ప్రొఫెషనల్ మోడల్ తరహాలో కనిపించింది.  ఈ ఫ్యాషన్ వీక్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో నెటిజనులకు ఫుల్లుగా లైకులు కొట్టారు.

ఇక రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో 'దే దే ప్యార్ దే'.. 'మర్జావా' సినిమాల్లో నటిస్తోంది.  తమిళంలో సూర్య 'NGK'.. శివకార్తికేయన్ నటించే మరో సినిమాలో కూడా రకుల్ హీరోయిన్. తెలుగులో 'మన్మధుడు 2' తో పాటుగా 'తుగ్లక్' అనే సినిమాకు సైన్ చేసిందని సమాచారం.


Tags:    

Similar News