'ధురంధ‌ర్ 2'ఎఫెక్ట్ ..ఆ డైరెక్ట‌ర్స్ మారాల్సిందేనా?

కంటెంట్‌ని న‌మ‌ముకుని కాకుండా మార్కెట్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు, చేర్పులు చేయ‌డం వ‌ల్లే సీక్వెల్స్ లేట్ అవుతున్నాయ‌ని అంతా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.;

Update: 2026-03-21 12:30 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ స్పై యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ధురంధ‌ర్‌`. గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీంతో సీక్వెల్‌పై అంచ‌నాలు పెర‌గ‌డం, ప్రీమియ‌ర్స్ నుండే సంచ‌ల‌నాలు సృష్టించ‌డం తెలిసిందే. మార్చి 19న అంటే కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే సీక్వెల్ థియేట‌ర్ల‌లోకి రావ‌డంతో అంతా అవాక్క‌వుతూ ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ ప్లానింగ్‌కి ఫిదా అవుతున్నారు.

సాధార‌ణంగా సీక్వెల్స్‌, ఫ్రాంచైజీలంటే ఫ‌స్ట్ పార్ట్ వ‌చ్చాక సెకండ్ పార్ట్ రావ‌డానికి ప్రేక్ష‌కులు ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సిందే. `బాహుబ‌లి` నుంచి ఇదే జ‌రుగుతోంది. ఒక్కో సీక్వెల్‌కి రెండేళ్లు ప‌డితే కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఏకంగా నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వ‌చ్చింది. ఇలా ఒక్కో సీక్వెల్ కోసం రెండు నుంచి నాలుగేళ్లు విరామం తీసుకుంటుండ‌టం తెలిసిందే. అయితే `ధురంధ‌ర్ 2` చూశాక సీక్వెల్స్ కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురు చూసేలా చేస్తున్న డైరెక్ట‌ర్ల‌పై ప్రెష‌ర్ మొద‌లైంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో సీక్వెల్స్ కోసం ద‌ర్శ‌కులు ఏళ్ల‌కు ఏళ్లు ఎదురుచూసేలా చేస్తున్నారు. అయితే `ధురంధ‌ర్‌` ఆ గ్యాప్ లేవీ పాటించ‌కుండా సెకండ్ పార్ట్‌ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే థియేట‌ర్ల‌లోకి తీసుకురావ‌డంతో సీక్వెల్స్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్లు సీక్వెల్స్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి ఏళ్ల‌కు ఏళ్లు వేయిట్ చేయిస్తుంటే ఆదిత్య‌ధ‌ర్ ఏంటీ రెండు మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే సీక్వెల్‌ని రిలీజ్ చేశాడ‌ని, ఇలా మ‌న వాళ్ల‌కు ఎందుకు కుద‌ర‌డం లేద‌ని నెటిజ‌న్‌లు వాపోతున్నారు.

కంటెంట్‌ని న‌మ‌ముకుని కాకుండా మార్కెట్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు, చేర్పులు చేయ‌డం వ‌ల్లే సీక్వెల్స్ లేట్ అవుతున్నాయ‌ని అంతా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంలో `ధురంధ‌ర్‌` స‌రికొత్త రికార్డ్‌ని బ్రేక్ చేసింద‌ని, ఎంచుకున్న కంటెంట్‌పై న‌మ్మ‌కం ఉంటే సీక్వెల్ కోసం ఏళ్ల‌కు ఏళ్లు గ్యాప్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఫ‌స్ట్ పార్ట్ విడుద‌లైన నెల రెండు నెల‌ల గ్యాప్‌లోనే సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌చ్చ‌ని నిరూపించింద‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా సీక్వెల్స్ పేరుతో ఏళ్ల‌కు ఏళ్లు వేయిట్ చేయిస్తున్న డైరెక్ట‌ర్ల దృక్ప‌థంలో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అంతే కాకుండా సినిమాపై ఉన్న హైప్‌ని దృష్టిలో పెట్టుకుని పెద్ద‌గా ప్ర‌చారం చేయాల్సిన ప‌ని కూడా లేద‌ని ఆదిత్య‌ధ‌ర్ ఈ మూవీతో నిరూపించాడు. రాజ‌మౌళిలా కోట్లు ఖ‌ర్చు చేసి ప‌బ్లిసిటీ అవ‌స‌రం లేద‌ని నిరూపించ‌డంతో సీక్వెల్స్ ప్ర‌క‌టించిన డైరెక్ట‌ర్లపై ప్రెషర్ మొద‌లైంది. అంతే కాకుండా ఆ డైరెక్ట‌ర్స్‌లో మార్పులు రావాలని కామెంట్‌లు చేస్తున్నారు. `ధురంధ‌ర్ 2` నేర్పిన పాఠంతో మ‌న డైరెక్ట‌ర్స్ సీక్వెల్స్ విష‌యంలో త‌మ ఆలోచ‌న‌ను మార్చుకుంటారా? అన్న‌ది వేచి చూడాల్పిందే.

Tags:    

Similar News