స్పీడ్ పెంచుతోన్న యూత్ స్టార్..సంక్రాంతి ఒకటి లాక్!
యూత్ స్టార్ నితిన్ వేగాన్ని పెంచాడు. వరుస సినిమాలతో బిజీగా అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు.;
యూత్ స్టార్ నితిన్ వేగాన్ని పెంచాడు. వరుస సినిమాలతో బిజీగా అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు కొత్త ప్రాజెక్టులను కూడా లైన్-అప్‌లో ఉంచుతున్నాడు. ఇప్పటికే వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా తన తదుపరి సినిమాలపై క్లారిటీ దాదాపు వచ్చేసినట్లు. తాజాగా ఆయన తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఒక క్రేజీ ప్రాజెక్టును లాక్ చేసినట్లు సమాచారం. `ఆయ్` సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించ బోతున్నాడని సమాచారం.
ఇదీ యూత్ పుల్ ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ గా లీకులందుతున్నాయి. ఈ ప్రాజెక్టును వచ్చే జులై నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సొంత నిర్మాణ సంస్థ కావడంతో స్క్రిప్ట్ విషయంలో నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్తదనం ఉన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించాలని అంజి ఇప్పటికే కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా విడుదల కోసం వచ్చే సంక్రాంతి సీజన్‌ను కూడా మేకర్స్ ఇప్పటికే లాక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమా కంటే ముందే మరో భారీ ప్రాజెక్టును నితిన్ పట్టాలెక్కించ బోతున్నారుట. ఒక అగ్ర నిర్మాణ సంస్థ లో నితిన్ నటించబోయే మరో కొత్త చిత్రం వచ్చే నెలలో లాంచింగ్ కానుందిట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ హీరోగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదొక విభిన్నమైన పీరియాడిక్ యాక్షన్ - ఫాంటసీ డ్రామా. కాల ప్రయాణం ,పునర్జన్మ వంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్ సినిమాలో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఇందులో నితిన్ గతంలో ఎప్పుడూ పోషించిన ఓ పవర్‌ఫుల్ - స్టైలిష్ పాత్రలో కనిపించనున్నాడు. నితిన్ బాడీ లాంగ్వేజ్ మేకోవర్‌లో వి.ఐ. ఆనంద్ ప్రత్యేక మార్పులు తీసుకువచ్చారు. షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఆనంద్ సినిమాల్లో విజు వల్స్ ప్రత్యేకంగా హైలైట్ అవుతుంటాయి. ఈ సినిమా కోసం టాప్ లెవల్ వీఎఫ్ఎక్స్ టీమ్ పని చేస్తోంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా నిర్మాతలు భారీ బడ్జెట్‌ను కేటాయించారు. అన్ని పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నితిన్ కు సక్సస్ లు కూడా లేని నేపథ్యంలో విజయంతో రేసులోకి రావాలని కసి పట్టుదలతో ఉన్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఏమవుతాయి? అన్నది చూడాలి.