ఆ పనికి ఆగలేకపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

Update: 2020-06-07 11:23 GMT
ఎప్పుడూ షూటింగ్ లు, సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ప్రారంభోత్సవాలతో సందడిగా ఉండే సినీ తారలకు ఈ మహమ్మారి వైరస్ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు.  దీంతో వారికి ఇంట్లో ఉండలేక పిచ్చెక్కిపోతోంది. పనిలేక షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో శాఖాహారిగా మారిన  రకుల్.. తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన పాత ఫొటోలు షేర్ చేసి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. మార్చిలో తాను చేసిన చివరి ఫొటో షూట్ నుంచి ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. ‘తిరిగి పని ప్రారంభించడానికి ఇక ఎంత మాత్రం వేచి ఉండలేననని.. ఈ వీడియో మార్చి చివరలో తీసిందని’ రకుల్ పేర్కొంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 14 మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం హిందీలోనే అర్జున్ కపూర్ తో ఓ రోమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తోంది.

కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియన్2’లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.  కాజల్ అగర్వాల్, విద్యుత్ జమ్వాల్ కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Tags:    

Similar News