ఇట్స్ ర‌కుల్ టైమ్ స్టార్ట్స్

Update: 2019-10-25 10:55 GMT
`మ‌న్మ‌ధుడు 2` త‌ర్వాత ర‌కుల్ కెరీర్ ప‌రంగా మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటోందనే తాజా స‌న్నివేశం చెబుతోంది. అవ‌కాశాల‌ ప‌రంగా ఇప్ప‌టికి డోఖా ఏం లేదు. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు 2లో .. శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న‌ అవ‌కాశం అందుకుంది. మునుముందు మ‌రిన్ని కమ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు సంత‌కాలు చేయ‌నుంది. ఆ క్ర‌మంలోనే యువ‌హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ర‌ణవీర్ సింగ్ వంటి వారితో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది.

అదంతా అటుంచితే.. ర‌కుల్ న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం `మ‌ర్జ‌వాన్` నుంచి ఓ పాట‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఇది ప్ర‌త్యేకించి ర‌కుల్ పై ఫోక‌స్ చేసిన స్పెష‌ల్ సాంగ్. `స‌బ్ కి జాన్ లేనే ఔర్ జాన్ బాన్ నే.. ఆ ర‌హి హై హ‌ర్ దిల్ కి ఆర్జూ... ఆర్జూ..! హైయా హో..!! అంటూ సాగే ఈ పాట‌ను రిలీజ్ చేయ‌నున్నారు. న‌వంబర్ 15న సినిమా రిలీజ్ కాబ‌ట్టి ఇక‌పై ప్ర‌చారాన్ని షురూ చేసింది చిత్ర‌బృందం.

ప్ర‌చారం లో భాగంగా సాంగ్ రిలీజ్ కి సంబంధించిన పోస్ట‌ర్ ని రకుల్ ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో అమ్మ‌డు సంథింగ్ హాట్ గానే క‌నిపిస్తోంది. ఒక న‌ర్త‌కి త‌ర‌హాలో ర‌కుల్ ఇచ్చిన ఫోజు చూస్తుంటే ఇందులో త‌న పాత్ర ప్ర‌త్యేక‌త ఏంటో అర్థ‌మ‌వుతోంది. చురుకైన చూపులు.. చెవికి బ‌రువైన లోలాకులు.. ఆ ముక్కు పుడ‌క‌.. చెయ్యెత్తి స‌లాం కొడుతున్న తీరు చూస్తుంటే చాలా గ‌మ్మ‌త్తుగానే క‌నిపిస్తోంది. ఇట్స్ ర‌కుల్ టైమ్ స్టార్ట్స్ అనుకోవాల్సిందేనేమో! రితేష్ దేశ్ ముఖ్- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- తారా సుతారియా- త‌నిష్ కె బాగ్చి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

    

Tags:    

Similar News