ఫోటో స్టొరీ: బాలీవుడ్ టచ్ ఇచ్చిన రకుల్

Update: 2019-04-11 18:24 GMT
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వెయ్యాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిజానికి తెలుగులో ఈమధ్య రకుల్ కు ఆఫర్లు తగ్గడానికి అది కూడా ఒక కారణం. రకుల్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' మే 17 న రిలీజ్ అవుతోంది.  అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా విజయంపై రకుల్ గట్టి నమ్మకమే పెట్టుకుంది.

రీసెంట్ గా ఈ సినిమానుండి 'వడ్డి షరాబన్' అంటూ సాగే ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.  ఈ పాటలో చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకుని 'రా' తాగుతూ పంజాబీ స్టైల్ లో పాట పాడుతూ.. దానికి అనుగుణంగా రకుల్ చేసే రచ్చ మామూలుగా లేదు.  ఈ పాటలో రకుల్ కట్టుకున్న చీర మహా సెక్సీ.  ఆ పాట నుండి ఒక స్టిల్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన రకుల్ "వడ్డి షరాబన్ రిలీజ్ అయింది. నేను నా ఉత్సాహాన్ని ఆపుకోలేకుండా ఉన్నాను.  ఈ సూపర్ ఫన్ సాంగ్ చిత్రీకరణ ఒక అద్భుతమైన అనుభవం. అసలు మందునే ముట్టుకోని నానుండి తాగుబోతుని బయటకు తీసినందుకు బాస్కో మార్టిస్( డ్యాన్స్ మాస్టర్) కు కృతజ్ఞతలు.  మీరు కనుక ఇంకా ఈ పాటను చూడకపోతే వెంటనే చూడండి." అంటూ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఫోటో విషయానికి వస్తే అజయ్ దేవగణ్ బ్లూ కలర్ సూట్ లో అటు తిరిగి ఉంటే రకుల్ ఆయనను ఆరాధనగా ఒక స్మైల్ తో చూస్తూ ఉంది.  కానీ ఫోటోలో అదికాదు కదా అసలు యూ ఎస్ పీ.  అది మీకీ తెల్సు..మాకి తెల్సు.. అందర్కీ తెల్సు!
 
Tags:    

Similar News