బొత్తాలు విప్పి మరీ చూపిస్తున్న రకుల్...!

Update: 2020-05-17 11:23 GMT
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'కెరటం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ 'వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్'లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ గా ఎదిగిందని చెప్పవచ్చు. కెరీర్ ఆరంభంలోనే క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించిన రకుల్ టాలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగచైతన్య, అల్లు అర్జున్, రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. దాదాపు ఐదేళ్ల పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఎప్పుడూ సమయం మనకు అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య రకుల్ అవకాశాలు తగ్గాయి. చేసిన సినిమాలన్ని ప్లాప్ అవడంతో టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోయింది. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో రాణించిన రకుల్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేకుండా ఇబ్బంది పడుతోంది. గతేడాది 'మన్మథుడు 2' సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి రావాలనుకుంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ భామకు నిరాశే ఎదురైంది. దీంతో కుర్రకారుకి వేడిపుట్టించే ఫోటో షూట్స్ కి పని చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రకుల్ తన ఫోటోలను పోస్ట్ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన రకుల్ రకరకాల ఫొటోలతో నేనున్నానంటూ దర్శక నిర్మాతలకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ తన అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా అమ్మడు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ఈ మూమెంట్ ప్రెష్ నెస్ తో జీవించండి. హ్యాపీ సండే' అని క్యాప్షన్ పెట్టి రకుల్ వేడిపుట్టించే ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో బ్లాక్ వైట్ లో అమ్మడు బ్యూటీని రెట్టింపు చేసి మతులు పోగొడుతోంది. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద సొంపులు కనిపించేలా ఫోజ్ ఇచ్చింది. ఇంకేముంది ఇది చూసి మన రసిక హృదయాలు తట్టుకోలేపోతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే కనిపించినప్పటికీ.. హిందీ తమిళంలో మాత్రం పలు చిత్రాలను చేసింది. అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' లో నటించిన రకుల్ 'మార్జావాన్' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం జాన్ అబ్రహం తో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఒక సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం. అంతేకాకుండా అజయ్ దేవగణ్ సరసన రకుల్ నటించిన 'దేదే ప్యార్ దే'కి సీక్వెల్ గా రాబోయే సినిమాలో కూడా నటించే అవకాశముందని అంటున్నారు.
Tags:    

Similar News