ఫోటో స్టొరీ: కూల్ పోజిచ్చిన రకుల్

Update: 2019-05-07 02:30 GMT
చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్డం సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య కెరీర్ కాస్త స్లో అయింది. అలా అని ఆఫర్లు లేకుండా ఏం లేదు. హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన 'దే దే ప్యార్ దే' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  తమిళంలో సుర్య కొత్త సినిమా 'NGK' కూడా రిలీజ్ కు రెడీ.  తెలుగులో 'మన్మథుడు 2' లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అయినా..

తన బుట్టలో క్రేజీ ప్రాజెక్టులు లేవని ఫీలయిందేమో కానీ కొన్ని రోజులుగా ఫోటోషూట్ల దుమ్ము దులుపుతోంది.  రోజు మార్చి రోజు కాదు.. పూటకో ఫోటో షూట్ చేయడం ఆ ఫోటోలను ఎత్తి.. ఇన్స్టాలో పడేయడం.. తాపీగా 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ చేసుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నట్టుంది.  తాజాగా మరో ఫోటో షూట్ చేసింది.  ఈ డ్రెస్ కూడా 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ కోసం వేసుకున్నదే అని తెలిపింది. నిలువు స్ట్రైప్స్ ఉన్న బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుంది.. దానికి కాంట్రాస్ట్ కలర్ వైట్ ప్యాంట్ వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది. పోనీ టెయిల్..  పర్ఫెక్ట్ మేకప్ తో.. యాక్సెసరీస్ ఏవీ లేకుండా ఒక సూపర్ మోడల్ లాగా కనిపిస్తోంది.  అందాల ప్రదర్శన షరా మామూలే!

ఇక చూసుకోండి.. నెటిజనులు రెచ్చిపోయారు. జస్ట్ 24 గంటలు కూడా కాకుండానే ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోయిందని ఒకరు.. రాకుల్ ఈజ్ ఆల్వేస్ కూల్ అని మరొకరు.. పొగడ్తలు కురిపించారు. ఒక నెటిజనుడు మాత్రం మెడలో ఒక పెండెంట్ లాంటిది పెట్టుకుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.  మరో నెటిజనుడు కాస్త కండ ఉండే అందంగా ఉంటావని నిట్టూర్చాడు. ఏదైతేనేం.. రకుల్ ఫోటో షూట్ల హంగామా ఇప్పట్లో ఆగేలా లేదు.


Tags:    

Similar News