రకుల్ అక్కడ కాదు.. ఇక్కడ పెట్టేసింది

Update: 2017-02-24 06:20 GMT
సెక్సీ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు తన అందాలతో ప్రేక్షకులను పలకరించనుంది. అదేనండీ బాబూ.. ''విన్నర్'' సినిమాతో ఈరోజు అమ్మడు ఎంట్రీ ఇస్తోంది. ''ధృవ'' సినిమాలో పరేషానురా సాంగుతో ఆడియన్స్ ను పలకరించాక ఇప్పుడు ఈ సినిమాలో మాసు పాటలతో అమ్మడు హంగామా చేయనుంది. ఇదంతా అటుంచితే.. ఇప్పుడు రకుల్ బిజినెస్ ప్లాన్స్ ఓసారి చూద్దాం పదండి.

ఆల్రెడీ సినిమా ఇండస్ర్టీలో సంపాదించిన డబ్బును హైదరాబాదులోనే ఇన్వెస్ట్ చేస్తూ అమ్మడు ఇక్కడ ఒక జిమ్ ఓపెన్ చేసింది. నూతన కాన్సెప్టుతో వచ్చిన ఎఫ్‌ 45 అనే జిమ్ వారి ఫ్రాంచైజ్ తీసుకుని గచ్చిబౌలిలో తన తమ్ముడుతో కలసి సదరు జిమ్ స్టార్ట్ చేసింది రకుల్. కట్ చేస్తే బ్యాంకాక్ లో కూడా ఎఫ్‌ 45 జిమ్ ఓపెన్ చేసిందనే వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం ఉందో లేదో తెలియదు కాని.. వైజాగ్ లో డస్పల్లా హిల్స్ లో అమ్మడు తన సొంత జిమ్ మాత్రం నిజంగానే ఓపెన్ చేసేసింది. ఆ విధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో  రెండు చోట్లా కూడా అమ్మడు బిజినెస్ స్థాపించేసింది. వండర్ ఫుల్ కదూ.

ఒక ప్రక్కన కాజల్ అండ్ తమన్నా వంటి బ్యూటీలు తెలుగులో బాగా సంపాదించి ఆ డబ్బులను బాంబేలో తమ జ్యూయలరీ బిజినెస్ లో ఇన్వెస్టు చేస్తుంటే.. రకుల్ మాత్రం అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడినట్లు.. ఇక్కడ డబ్బును ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం బాగుందిలే అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News