రకుల్ తో పనే కాదు.. సైక్లింగ్ తో పని కానిచ్చిందట!
ఒక్కొకరికి ఒక్కో పిచ్చి. ఈ లోకంలో అలా పిచ్చి లేని వాడు మనిషే కాదు. స్మార్ట్ ఫోన్ ను మనం మాటి మాటికి స్క్రీన్ అన్ లాక్ చేసి చూసుకోవడం కూడా ఒక రకం పిచ్చేనట. అయినా మనకుండే పిచ్చి గురించి మన ఇంట్లో వాళ్ళే వినరు. ఇక బైట ఉండే వాళ్ళు అసలెందుకు పట్టించుకుంటారు? అదే బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి అనుకోండి.. అందరూ వింటారు.
ఇంతకూ అమెకుండే పిచ్చేమిటంటే ఫిట్నెస్ పట్ల విపరీతమైన శ్రద్ద కలిగి ఉండడం. ఆరు నూరైనా.. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఎక్సర్ సైజు చెయ్యడం మానదట. ఇండియాలోనే కాదు విదేశాలకు వెళ్ళినా తన దినచర్యలో కసరత్తులు ఖచ్చితంగా ఉండాల్సిందేనట. రకుల్ బాలీవుడ్ సినిమా 'దే దే ప్యారే దే' లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఈ సినిమాలోనే 'తూ మిలా తో హైనా' పాటను లండన్ లోని హైడ్ పార్క్ పరిసరాల్లో చిత్రీకరించారట. దీంతో తను బస చేసే హోటల్ నుంచి ఒక సైకిల్ తీసుకొని ఎంచక్కా లండన్ వీధుల్లో సైకిల్ తొక్కుకుంటూ షూటింగ్ లొకేషన్ కు వెళ్ళిపోయిందట. తిరిగి వచ్చే సమయంలో కూడా అదే తంతు.
ఓవరాల్ గా 5 - 6 కిలోమీటర్లు ఇలా సైక్లింగ్ చేసి ఉంటుందట. మనం అసలే ఎక్సర్ సైజులు చెయ్యం. పొరపాటున డబ్బు కట్టి జిమ్ములో చేరినా "ఈరోజు రెండు తుమ్ములు వచ్చాయి.. డుమ్మా కొడదాం".. "ఈరోజు ఫ్రైడే ఏం పోతాం లే" అనుకొని ఎగ్గొడుతూ ఉంటాం. ఈ లెక్కన మనందరం కూడా ఫిట్నెస్ విషయంలో రకుల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందే.. ఏమంటారు?