గుడ్ ఈవెనింగ్ వ‌దిన‌మ్మా ర‌కుల్ పులావు బావుంది!

Update: 2021-03-31 13:35 GMT
అపోలో లైఫ్ క‌ర్త‌ ఉపాస‌న కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల యువ‌ర్ లైఫ్ డాట్ ఇన్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి ప్ర‌త్యేకంగా లైఫ్ స్టైల్.. ఆరోగ్యం త‌దిత‌ర విషయాల‌పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓవైపు అపోలో సేవ‌ల గురించి వెల్ల‌డిస్తూనే.. ర‌క‌ర‌కాల సామాజిక విష‌యాల‌పైనా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచుతూ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారీ స‌మ‌యంలో ఉచితంగా అపోలో త‌ర‌పున సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇక యువ‌ర్ లైఫ్ డాట్ ఇన్ కోసం ఉపాస‌న స్నేహితులంతా వీడియో ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అవి అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కుముందు స‌మంత ర‌క‌ర‌కాల వంట‌కాల గురించి చెప్పారు. ఇప్పుడు మ‌రో స్నేహితురాలు .. జిమ్ మేట్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ స్పెష‌ల్ వీడియోని కానుకిచ్చారు. ర‌కుల్ ఓ ఆస‌క్తిక‌ర‌ డిష్ గురించి ఈ వీడియోలో టిప్స్ చెప్పారు. చ‌క్క‌ని ఔషధ గుణాలు క‌లిగిన న్యూట్రిష‌న్ స్పించ్ పీస్ పులావును ఎలా వండాలో ర‌కుల్ ప్రీత్ నేర్పించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోకి ఆన్ లైన్ లో మాంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ .. ఉపాస‌న ఇరువురు ఫిట్నెస్ ఫ్రీక్స్ గా అభిమానుల‌కు సుప‌రిచితం. తాజాగా ర‌కుల్ పులావు మేకింగ్ వీడియో వీక్షించిన‌ చ‌ర‌ణ్ అభిమానులంతా .. గుడ్ ఈవెనింగ్ వ‌దిన‌మ్మా! అంటూ ఉపాస‌న‌ను ప‌లక‌రిస్తున్నారు. స్పించ్ పీచ్ పులావ్ న‌చ్చిందంటూ కొంద‌రు అభిమానులు వ్యాఖ్యానించారు.
https://twitter.com/upasanakonidela/status/1377231977825202176
Tags:    

Similar News