ఖాళీగా ఉన్నాం.. కబడ్డీ ఆడదాం రా! అంటున్న హీరోయిన్
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా, ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతున్నారు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు చేసే ప్రతి పని చాలా సరదాగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికి వారు తమ చిన్న నాటి సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో తన తమ్ముడు అమన్ తో కలిసి ఉంటోంది. రకుల్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు. ఇక తమ్ముడు ఉండడంతో ప్రతిరోజు టైమ్ పాస్ చేస్తుందట రకుల్. చిన్నతనంలో జరిగిన జ్ఞాపకాలను అన్నీ పంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ లాంగ్ లాక్ డౌన్ తనను చిన్నప్పటి రోజులకు తీసుకువెళ్లిందని తెలిపింది. చిన్నతనంలో తమ్ముడితో కలిసి ఆడిన ఆటలను మళ్లీ ఆమె ఆడారు.
ఖాళీగా ఉన్నాం కదా.. అని కబడ్డీ కబడ్డీ, డాగ్ అండ్ బోన్ తదితర ఆటలు రకుల్ తన తమ్ముడితో ఆడింది. అందులో ముఖ్యంగా పులుసు పోయడం ఆట బాగా ఇంటరెస్టింగ్ గా సాగింది. ఒకరు పులుసు పోస్తుంటే మరొకరు చేత్తో కొడతారు. ఈ ఆటలో రకుల్ చేతిని అమన్ చాలా గట్టిగా కొట్టారు. ఆటల్లో ఇవన్నీ కామన్ కదా! అందుకని, ఫైనల్ గా రకుల్ హ్యాపీ. ఇక తమ్ముడితో ఆడిన ఆటలన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రకుల్ సరదాగా తన సోదరుడితో కలిసి ఆడిన కబడ్డీ ఆటలో.. సరదాగా కొట్టుకుంటూ మొత్తానికి తన సోదరుడి మీద పై చేయి సాధించింది. ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉంటే.. చిన్నతనంలో ఆడిన ఆటలు మరొక్కసారి ఫ్యామిలీతో ఆడే ప్రయత్నం చేయండని గుర్తు చేస్తుందని అభిమానులు హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి