సారా, రకుల్ పేర్లను రియా వెల్లడించలేదు: ఎన్.సీ.బీ

Update: 2020-09-14 07:50 GMT
సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) రంగంలోకి దిగి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను రియా వెల్లడించినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. నెటిజన్స్ కొందరు సారా, రకుల్ పై తమదైన రీతిలో విమర్శలు కూడా చేశారు.

జాతీయ చానెల్ అయిన టైమ్స్ నౌ ఛానల్ ముందుగా ఈ రియా కేసులో  బాలీవుడ్ తోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 25 పేర్లను రియా చక్రవర్తి వెల్లడించిందని వార్తను వైరల్ చేసింది.

అయితే తాజాగా ఈ ప్రచారంపై ఎన్.సి.బీ క్లారిటీ ఇచ్చింది.  పుకార్లకు చెక్ పెట్టింది. ఎన్.సీ.బీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఈ విషయంపై స్పందించారు. ‘మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠా వివరాలను సేకరించాం. బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేసుకోలేదు. కానీ అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్ట్ గా అపార్థం చేసుకున్నారు’ అని అన్నారు. హీరోయిన్లు రకుల్, రియా పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి కదా అని ప్రశ్నిస్తే.. అలాంటిది ఏమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు.

డ్రగ్స్ వ్యవహారంతో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు లేవని తెలియడంతో నెటిజన్లు, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు క్షమాపణలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరు పోస్ట్ చేసిన పోస్టులను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సమంత ‘సారా, రకుల్ ’లకు సపోర్టుగా మాట్లాడింది. ఇలా నెటిజన్లు హీరోయిన్లపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.
 
రకుల్ మరియు సారా పేర్లతో పాటు రియా చాలా పేర్లను వెల్లడించినట్టు జరిగిన ప్రచారంతో బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. మరియు టీవీ ఛానెల్స్ అనేక చర్చలు జరిపాయి, అక్కడ వారు బాలీవుడ్ యొక్క మాదకద్రవ్యాల సంబంధాన్ని తమదైన రీతిలో బహిర్గతం చేశారు . ఈ కోణంలో అనేక ఇంటర్వ్యూలను నిర్వహించి రచ్చ చేశారు.. ఎన్‌సిబి ఇప్పుడు వారికి ఎవరికి ప్రమేయం లేదని క్లియర్ గా చెప్పడంతో ఆరోపించిన  ఛానెల్‌లు ఇప్పుడు ఏమి సమాధానం ఇస్తాయో చూడాలి.
Tags:    

Similar News