• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామరావుగారి అమ్మాయి.....

రామరావుగారి అమ్మాయి.. ఎవరు ఈ రాజీషా విజయన్?

By - Tupaki Desk
Update: 2022-07-15 08:51 GMT
రాజీషా విజయన్.. గత ఏడాది నుంచి ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా ఈ పేరు వినిపిస్తోంది. ఇక నేడు ఈ పాప పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆమె పేరు వైరల్ గా మారుతుంది. ఆమెకు సంబంధించిన సినిమాల పోస్టర్స్ లుక్స్ కూడా విడుదలవుతున్నాయి. ఈ బ్యూటీ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ బ్యూటీ ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట టెలివిజన్ యాంకర్ గా వర్క్ చేసిన రాధిక ఆ తర్వాత తొందరగానే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా డిఫరెంట్గా నటించిన రాజీషా విజయన్ టాలెంట్ ను చూసి దర్శక నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇక ముందుగానే టెలివిజన్ రంగంలో అందరికీ కనెక్ట్ అవ్వడంతో సినిమాల్లో కూడా బాగానే క్లిక్ అయింది.

మొదట మలయాళం సినిమాల్లో వర్క్ చేసిన రాజీషా అనంతరం తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. ఇక తమిళంలో మొదట ధనుష్ నటించిన కర్ణన్ సినిమా ద్వారా తన స్థాయిని మరింత పెంచుకుంది.

అందులో అమ్మడి నటనకు ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఇక సూర్య జై భీమ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన రాజీషా సౌత్ ఇండస్ట్రీలో ఫోకస్ అయ్యింది. సొంత బాషా మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటోంది.

ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరపై కనిపించబోతోంది. చిత్ర దర్శకుడు శరత్ మండవ కారణంగానే అమ్మడు సినిమాలో సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇక రామరావు సినిమా యూనిట్ రాజీషా విజయన్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పోస్టర్ విడుదల చేయగా అందులో రాజీషా లంగావోనిలో పూర్తిగా పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందట. మరి జూలై 29న రాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • RajishaVijayan 
  • FilmIndustry 
  • TollywoodFilm 
  • RamaRaoonDutyFilm 
  • Dhanush 
  • KarnanMovie 
  • JaiBheemMovie 
  • Surya 
  • SharathMandava 
  • Raviteja 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS