​ఈసారైనా రజినీతో సేవ్ అవుతారా?

Update: 2017-08-11 04:37 GMT
సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా అంటే అభిమానులలో ఒక పండుగ లాంటిదే. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలకు ఒకప్పటి క్రేజ్ కొంచెం తగ్గుముఖం పట్టింది అనే చెప్పాలి. రోబో సినిమా తరువాత ఆ స్థాయి కలెక్షన్లు కానీ రజినీ సినిమాకు దక్కే విజయం కానీ రాలేదు. కిందటి ఏడాది వచ్చిన ‘కబాలి’  సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై తెలుగు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు రజినీ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా 2.0 విడుదలకాబోతుంది.

రజినీ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉన్న ఇప్పటి నుండే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయడం మొదలుపెట్టింది. 2.0  సినిమాకు సంబంధించి తెలుగు డిస్ట్రిబ్యూషన్ గ్లోబల్ సినిమా వాళ్ళు పెద్ద మొత్తం పెట్టి కొనుకున్నట్లు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ ఒక ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తేలియపరిచారు. “ 2.0 సినిమా మేము కూడా ఊహించని మొత్తానికి అమ్ముడుపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మునుపు ఎన్నడూ లేని బిజినెస్ చేసింది. గ్లోబల్ సినిమా వాళ్ళతో కలిసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడం సినిమా చరిత్రలో ఇది ఒక గొప్ప కలయకగా మిగిలిపోతుంది'' అని చెబుతున్నాడు. రజినీ కబాలి సినిమా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు సుమారుగా 30 కోట్లు నష్టపోయారు. అంతక మునుపు లింగ.. కొచ్చాడయాన్.. వంటి సినిమాలతో కూడా బాగానే నష్టపోయారు. మరి ఈసారైనా 2.0 సినిమాతో ఆ నష్టాన్ని వసూలు చేసుకోగలుగుతారో లేదో చూడాలి.  అసలు పాత నష్టాలను అటుంచి కొత్త నష్టాలను తెచ్చుకోకుండా ఉంటే చాలులే.

2018 జనవరి 25 నాడు విడుదలకాబోతున్న 2.0 ని శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజినీకి ప్రతి నాయకుడుగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. 2.0 కి ఏ ఆర్ రహ్మాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్ వాళ్ళు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 2.0 ప్రపంచవ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.​
Tags:    

Similar News