ప్రతిభ దేవుడిచ్చేది, తల్లిదండ్రులివ్వరు

Update: 2015-07-29 09:54 GMT
ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ ఇటీవలే స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళిగా స్వరమాంత్రికుడు ఇళయరాజా ఓ ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించారు. ఎన్నున్నిల్‌ ఎమ్మెస్వీ (నా హృదయంలో ఎమ్మెస్వీ) పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎమ్మెస్వీ గురించి ముచ్చటిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రతిభ దేవుడిచ్చే వరం. అది తల్లిదండ్రుల నుంచి సంక్రమించదు. ఎమ్మెస్వీ సంగీత సరస్వతీ పుత్రుడు. 1960,70లలో శివాజీ గణేషన్‌, ఎంజీఆర్‌ వంటి నటులు, మహా దర్శకులు, ఎస్‌.పి.సుశీల వంటి వారి ఖ్యాతిని రెట్టింపు చేసిన గొప్ప మహానుభావుడు. ఆయన లాంటి సంగీత జ్ఞానిని ఇంతవరకూ చూడనేలేదు. పేరు ప్రఖ్యాతులు ఎంత ఉన్నా చాలా సామాన్యంగా బతికేవారాయన. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాన'ని రజనీకాంత్‌ ఈ సందర్భంగా జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.  

గులేభా కావలి కథలో ఎమ్మెస్వీ స్వరాల్ని నేటికీ పాడుకోవచ్చు. కానీ నేటి పాటల్ని పాడుకోలేమని ఇళయరాజా వ్యాఖ్యానించారు. కంప్యూటర్‌ స్వరాల్ని మర్చిపోయి బుర్రలకు పదును పెట్టాల్సిందిగా ఇళయరాజా నవతరం సంగీతదర్శకులపై పంచ్‌ వేశారు. రాజా చెప్పిన చివరి లైన్‌ లో, రజనీకాంత్‌ మాట్లాడిన మొదటి లైన్‌ లో ఎంత భావం ఉందో అర్థం చేసుకుంటే నవతరం బాగుపడేందుకు ఆస్కారం ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.

Tags:    

Similar News