అవును విడాకులు తీసుకుంటున్నా -సౌందర్య

Update: 2016-09-17 04:12 GMT

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు చిన్న కూతురు సౌందర్య వివాహ జీవితంపై రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చాయి. ఈమె తన భర్త అశ్విన్ నుంచి విడాకులు తీసుకుంటోందన్నది వాటి సారాంశం. సోషల్ మీడియాలోఈ విడాకులపై వార్తలు వేగంగానే వచ్చేసినా.. స్టార్ హీరో.. అందులోను దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రజినీకాంత్ కూతురు కావడంతో..  ఈ విడాకులపై ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి టెలివిజన్ మీడియాకి ఏర్పడింది.

కానీ తన వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలను ధృవీకరించింది సౌందర్యా రజినీకాంత్. 'నా వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలు నిజమే. మేం గత ఏడాదిగా విడిగానే ఉంటున్నాం. విడాకుల చర్చలు నడుస్తున్నాయి. నా కుటుంబం ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుకుంటున్నా' అంటూ అఫీషియల్ గానే అనౌన్స్ చేసేసింది సౌందర్య. ఒక్క మాటతో తన జీవితంపైనా.. రజినీ చుట్టూ జరుగుతున్న ప్రచారానికి సమాధానం ఇచ్చింది.

ఇదే సమయంలో సౌందర్య.. తన తండ్రి గర్వించే ఓ అఛీవ్మెంట్ ని సాధించింది. సినీ సమాజం తరఫున యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో సౌందర్యకు స్థానం లభించింది. సినిమాల్లో జంతువుల సంక్షేమానికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇది సౌందర్యా రజినీకాంత్ కు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పాల్సిందే.
Tags:    

Similar News