60+ స్టార్స్‌‌ ప్రేమ కథ

Update: 2020-12-21 23:30 GMT
ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్ లకు మంచి డిమాండ్‌ పెరిగింది. సినిమాలతో సమానమైన క్రేజ్ ను వెబ్‌ సిరీస్ లు తెచ్చి పెట్టడంతో పాటు పారితోషికాలు భారీగా ఇస్తున్న కారణంగా ఓటీటీ కంటెంట్‌ లో స్టార్స్ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ దర్శకులు వెబ్‌ కంటెంట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వీఎన్‌ ఆధిత్య లవ్‌ @ 60 అనే వెబ్‌ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. 60 ఏళ్లు దాటిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది... వారి కుటుంబ సభ్యులు మరియు వారి చుట్టు పక్కల వారి రియాక్షన్‌ ఏంటీ అనేది ఈ వెబ్‌ సిరీస్‌ లో చూపించబోతున్నారట.

60 ఏళ్లు దాటిన లవర్స్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ మరియు జయప్రదలు నటిస్తున్నారు. వీరిద్దరు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో గుర్తింపు దక్కించుకున్న స్టార్స్‌. జయప్రద సినిమాలకు కాస్త దూరం మెయింటెన్స్‌ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో వెబ్‌ సిరీస్‌ లో ఈమె నటించేందుకు ఒప్పుకోవడంతో కథ ఎంతగా ఆమెకు నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వీఎన్‌ ఆధిత్య విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లను తెరకెక్కించడంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కనుక ఈ వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ఏ ప్లాట్‌ ఫామ్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.. ఎప్పుడు విడుదల కాబోతుంది అనే విషయాలు త్వరలో అధికారికంగా వెళ్లడించే అవకాశం ఉంది.
Tags:    

Similar News