సినిమా చేసుకోమంటే ప్రభాసే వద్దన్నాడట
‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ ఎంత కమిట్మెంట్ చూపించాడో రాజమౌళి ఇంతకుముందే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన హీరో మీద ప్రశంసల జల్లు కురిపించాడు జక్కన్న. ప్రభాస్ లేకుంటే ‘బాహుబలి’ సినిమానే లేదని.. అంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరో నాలుగేళ్ల పాటు ఒక సినిమాకు అంకితం కావడం అన్నది మామూలు కమిట్మెంట్ కాదని రాజమౌళి వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ‘మహిష్మతి’ సెట్లో కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చిన జక్కన్న.. ప్రభాస్ గురించి ఇంకా ఏమన్నాడంటే..
‘‘ప్రభాస్ నేను అడిగిందానికంటే ఎక్కువ డేట్లు ఇచ్చాడు. రెండేళ్లలో అనుకున్న సినిమాకు నాలుగేళ్లు పట్టింది. ప్రభాస్ లాంటి స్టార్ ఒక సినిమా కోసం నాలుగేళ్లు వెచ్చించడం మామూలు విషయం కాదు. ఇక సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. నిజానికి ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ పూర్తయ్యాక అతను వేరే సినిమా చేయాల్సింది. ముందు చేయాలనే అనుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. మేం వేరే సినిమా చేసుకోమన్నా.. వద్దు తాను ‘బాహుబలి’ నుంచి బయటికి వెళ్లలేనన్నాడు. 8-9 నెలలు ఖాళీ దొరికినా కూడా సినిమా చేయకుండా ఉండిపోయాడు. అదీ అతడి కమిట్మెంట్. మన కోసం ఒక హీరో అంతగా నిలబడినపుడు మరింత కష్టపడి పని చేయాలనిపిస్తుంది. యూనిట్లో అందరూ కూడా నన్ను అలా ఇన్ స్పైర్ చేసిన వాళ్లే’’ అని రాజమౌళి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/