రాజమౌళి గురించి బచ్చన్ సాబ్...

Update: 2016-10-28 05:06 GMT
సర్కార్3 సెట్స్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కలిసిన సంగతి ఇప్పటికే చెప్పేసుకున్నాం. ఓ ఫోటో పోస్ట్ చేసి మరీ.. యాక్టింగ్ బాహుబలితో ఫిలిం మేకింగ్ బాహుబలి అంటూ వర్మ ఈ కలియికను వివరించాడు. ఇప్పుడు బచ్చన్ సాబ్ కూడా.. రాజమౌళి తనను కలిసిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

'సర్కార్ సెట్స్ పై ఉండగా అద్భుతమైన చిత్రరాజం అయిన బాహుబలిని తెరకెక్కించిన జీనియస్ దర్శకుడు రాజమౌళి.. సింపుల్ హంబుల్ మ్యాన్' అంటూ జక్కన్న గురించి ట్వీట్ పెట్టాడు అమితాబ్. ఈయన పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే.. రాజమౌళి ఎంత సింపుల్ అనే విషయం అర్ధమవుతుంది. బచ్చన్ సాబ్ ఏదో చెబుతోంటే.. చక్కగా చేతులు కట్టుకుని మరీ నవ్వుతున్నాడు జక్కన్న. అంతే కాదు.. బిగ్ బీ ముందు కూచునేందుకు కూడా రాజమౌళి ఇష్టపడకపోవడంతో.. చివరకు తనే నుంచుని మాట్లాడాడు అమితాబ్ కూడా.

ఇంతకీ యాక్టింగ్ బాహుబలితో ఫిలిం మేకింగ్ బాహుబలి ఏం మాట్లాడడనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. బాహుబలి2లో తనకు ఒక సీన్ లో అయినా నటించే ఆఫర్ ఇమ్మని గతంలో అమితాబ్ అడిగారు. ఒకవేళ ఆ టాపిక్ గురించి ఏమన్నా మాట్లాడ్డం జరిగుంటుందా అనే ఊహలు మొదలైపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News