RRR ప్రీమియర్స్ కోసం జక్కన్న సరికొత్త ప్లాన్..?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
RRR మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు నేషనల్ వైడ్ మంచి కబజ్ తెచ్చిపెట్టారు. ఈ ఊపు చూస్తుంటే 'బాహుబలి' రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యూఎస్ఏ లో జనవరి 6న RRR ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే అదే రోజున ఇండియాలోనూ భారీగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి.
మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతోపాటుగా యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడుస్తున్నాయి. కేరళలో కూడా సగం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు రన్ అవుతున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు షోలకు మాత్రమే వేయాల్సి ఉంటుంది. స్పెషల్ షోలకు అక్కడ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో వసూళ్ళలో ఏర్పడే లోటును.. జనవరి 6వ తేదీన RRR ప్రీమియర్ షోలతో పూడ్చాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
తెలంగాణాలో ఐదు షోలలతో పాటుగా స్పెషల్ షోలు ప్రదర్శించడానికి అనుమతి ఉంది. అందుకే భారీగా ప్రీమియర్స్ వేయాలని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ యోచిస్తోందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఈ సినిమాని ముందుగా చూసేందుకు ఆంధ్రా జనాలు కూడా తెలంగాణ థియేటర్లకు పోటెత్తే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగానే ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదవుతాయని చెప్పవచ్చు. మరి జక్కన్న అండ్ టీం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.