సెల్ఫీ కల్చర్‌పై మహేష్ బాబు రియాక్ష‌న్.. వైరల్ అవుతున్న కామెంట్స్

అయితే తాజాగా సెల్ఫీ కల్చర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Update: 2026-06-10 00:30 GMT

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు సాధారణంగా వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు దూరంగా ఉండే వ్యక్తి. తెరపై ఎనర్జీతో మెప్పించే ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా రిజర్వ్డ్‌గా ఉంటారనే విషయం అభిమానులకు తెలిసిందే. సినిమా షూటింగ్స్, ప్రమోషన్లు తప్పితే మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడే మహేష్, సోషల్ గ్యాదరింగ్స్ లేదా పార్టీ కల్చర్‌కు కూడా ఎక్కువగా దూరంగానే ఉంటారు. అయితే తాజాగా సెల్ఫీ కల్చర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలకు ఎదురవుతున్న ప్రైవసీ సమస్యల గురించి మహేష్ బాబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఫోన్లలో కెమెరాలు ఉండేవి కాదు. చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఒక్కొక్కరు సెల్ఫీలు అడుగుతుంటారు. అది తప్పు అని నేను చెప్పడం లేదు. అభిమానుల ప్రేమ, ఉత్సాహం అలాంటిదే. కానీ ఒక స్థాయి దాటితే అది వ్యక్తిగత గోప్యతలోకి వస్తుంది. ప్రతిరోజూ అదే పరిస్థితి ఎదురైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అభిమానుల పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూనే, సెలబ్రిటీల ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను గౌరవించాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని మహేష్ సున్నితంగా తెలియజేసినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల విస్తరణతో సెలబ్రిటీ- ఫ్యాన్ సంబంధాలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలను ప్రత్యక్షంగా చూడటమే అభిమానులకు గొప్ప అనుభూతి అయితే, ఇప్పుడు సెల్ఫీ లేదా వీడియో లేకపోతే ఆ క్షణం అసంపూర్ణంగా భావించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, రెస్టారెంట్లు, హాలిడే స్పాట్లు వంటి ప్రైవేట్ సందర్భాల్లో కూడా సెలబ్రిటీలు కెమెరాల మధ్యనే ఉండాల్సి వస్తోంది. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఈ మారుతున్న క‌ల్చ‌ర్‌పై మరోసారి చర్చకు తెరలేపాయి. అభిమానుల ప్రేమ ఎంత ముఖ్యమో, అదే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయానికి ఆయన మాటలు బలం చేకూర్చాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు S. S. రాజ‌మౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకమైన మేకోవర్‌తో సిద్ధమయ్యారు. అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనే టార్గెట్ తో మేకర్స్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఒకవైపు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటిస్తూనే, మరోవైపు సెలబ్రిటీ జీవితంలో ఉండే సవాళ్ల గురించి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానుల ప్రేమను గౌరవిస్తూ, తన వ్యక్తిగత ప్రైవసీపై కూడా స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిన మహేష్ బాబు మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతున్నాయి.

Tags:    

Similar News