అటు అమరావతి.. ఇటు నరసింహారెడ్డి

Update: 2017-09-25 06:00 GMT
తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ప్రేక్షకులను మెప్పించడానికి.. కలెక్షన్లు రాబట్టడానికి ఆకాశమే హద్దు అని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత మన స్టాండర్డ్స్ పెరిగాయని హీరోల నుంచి డైరెక్టర్స్ వరకు అందరూ చెబుతున్న మాటే. ఆషామాషీ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను మెప్పించలేమని అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకే ఖర్చయినా సరే బాహుబలి లాగానే తీయాలని బడా దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డి మూవీ కూడా బాహుబలి స్థాయిలో నిర్మించాలని చిరంజీవి తనయుడు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ డిసైడైపోయాడు. అందుకే సినిమాలో నటించేవారితో పాటు టెక్నీషియన్స్ అందరినీ టాప్ లో ఉన్నవారినే ఎంపిక చేసుకున్నాడు. దీనితోపాటు గ్రాఫిక్స్ కూడా బాహుబలికి దీటుగా ఉండాలన్న ఉద్దేశంతో లండన్ లో చేయిస్తున్నారు. దీనికి సంబంధించి దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నారట.

రాజమౌళి ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సంబంధించి డిజైన్ల రూపకల్పనకు సలహాలు ఇస్తున్నారు. ఇదే పనిలో భాగంగా రాజమౌళి లండన్ వెళ్తున్నారు. ఇదే సమయంలో పనిలో పనిగా సైరా.. నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ మరింత బాగా వచ్చేందుకు అవసరమైన సలహాలు ఇవ్వనున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ కే కాదు.. ఆయన సలహాలకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.


Tags:    

Similar News