అరవింద్ పై రాజమౌళి కోపమందుకేనా?

Update: 2017-05-27 10:31 GMT
రాజమౌళి సినిమా అంటేనే రికార్డులు మార్మోగిపోతాయి. ఆయన డైరెక్షన్ లో చేసిన హీరోకి స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. బాహుబలితో ప్రభాస్ పేరు దేశం మొత్తం మార్మోగిపోతోందంటే ఆ ఘనత కచ్చితంగా జక్కన్నదే. రాజమౌళి కెరీర్ లో ఎలాంటి వివాదాలూ లేవు. బ్లాక్ మార్కులు లేవు. ఒక్క మగధీర విషయంలో మాత్రమే ఆయన కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు.

తెలుగు సినిమా రికార్డులు బద్దలుకొట్టిన సినిమాల్లో మగధీర ఒకటి. ఈ సినిమా ఘనవిజయం క్రెడిట్ రాజమౌళికి రాలేదన్నది అప్పట్లో వచ్చిన కామెంట్. దీనిని చరణ్ విజయంగానే నిర్మాత అల్లు అరవింద్ ప్రొజెక్ట్ చేయడంపై రాజమౌళి ఫీల్ అయ్యారనేది అప్పట్లో వచ్చిన టాక్. అందుకే హీరోతో సంబంధం లేకుండా తాను హిట్ సినిమా తీయగలనని ప్రూవ్ చేసుకోవడానికే సునీల్ ని హీరోగా పెట్టి మర్యాద రామన్న తీశారు.  అరవింద్ తో తలెత్తిన విభేదాలపై అప్పట్లో రాజమౌళి పెదవి విప్పలేదు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అరవింద్ పై అప్పట్లో చాలా కోపం వచ్చిందని చెప్పుకొచ్చారు. మగధీర 100 రోజుల వేడుకకు కావాలనే తాను హాజరు కాని విషయమూ అంగీకరించారు.

ఈ వివాదానికి సంబంధించిన రాజమౌళి మనసులోని మాట ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. రాజమౌళి ఇంటర్వ్యూపై ఇచ్చిన ప్రొమోలో ఈ మాటలను బయటపెట్టారు. ఆయన ఇంటర్వ్వూలో ఇంకేం విశేషాలు చెప్పారు.. అరవింద్ కు డైరెక్ట్ అటాక్ ఇచ్చారా అన్నది తొందరలో తెలుస్తుంది.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News