• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ - చరణ్ స్క్రీన్...

ఎన్టీఆర్ - చరణ్ స్క్రీన్ టైమ్ పై జక్కన ఏమన్నాడంటే...?

By - Tupaki Desk
Update: 2020-04-14 10:50 GMT
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు మొత్తం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా - ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ ఆర్‌ ఆర్‌). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోస్టర్ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తరవాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ చరణ్ అభిమానులతో పాటు యావత్ సినీ అభిమాని మదిలో మెలిగిన ప్రశ్న.. రాజమౌళి ఈ సినిమాలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో - ఇద్దరిని బ్యాలన్స్ గా చూపించాడా అని. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు అంటే వారి ఫ్యాన్స్ ఖచ్చితంగా వాళ్ళ హీరో డామినేషన్ ఉండాలని కోరుకోవడం సహజం.

అయితే ఈ మధ్య రాజమౌళి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడట. 'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ క్యారెక్టర్ల రన్ టైమ్ గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చాడట. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు తమ పాత్రల కోసం ప్రాణం పెట్టి నటించారని కొనియాడారంట. ఏదేమైనా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేది పక్కన పెట్టి జక్కన్న మీద భారం వేసి సినిమా మీద హోప్స్ పెట్టుకోమని పలువురు సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ సుమారు మూడు గంటలు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఆలియా భట్ - బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Tags:    
  • Rajamouli Clarifies On Balancing Roles Of Star Heroes 
  • RRR 
  • Ss Rajamouli 
  • Tollywood 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri Sita Rama Raju 
  • Koamaram Bheem 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS