రాజమౌళి నోట ఫ్లాప్ మాట... ?

Update: 2021-11-03 15:30 GMT
ఆయన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను అతి గొప్ప మలుపు తిప్పిన సినీ యోధుడు. బాహుబలితో తెలుగు ఖ్యాతిని ఎక్కడితో తీసుకుపోయిన నైపుణ్యం ఆయన సొంతం. రాజమౌళి ఇప్పటిదాకా తీసిన సినిమాలు పట్టుమని పదిహేను కూడా ఉండవు. ఆయన రెండు దశాబ్దాలుగా దర్శకుండిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లే. బాహుబలి వన్, టూ మూవీస్ తో వేల కోట్ల కలెక్షనలు కళ్ల చూసిన దర్శక దిగ్గజంగా కూడా చెప్పుకోవాలి.

అలాంటి జక్కన్న ట్రిపుల్ ఆర్ మూవీతో  భారతీయ సినిమా రంగంలో సరికొత్త రికార్డులను టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తన ఫ్లాష్ బ్యాక్ ని నెమరువేసుకున్నారు. తన తొలి ప్రేమ వివరాలూ రివీల్ చేశారు.  ఇక సినిమాల్లొకి రాక మునుపు  తన సతీమణి రమా రాజమౌళి ఒకనాడు జాబ్ చేస్తే తాను కేవలం కధలు రాసుకుంటూ గడిపానని కూడా చెప్పారు. తమ బంధం గొప్పదని, అసలైన ప్రేమ తన శ్రీమతిది అని ఆయన పేర్కొన్నారు.

తన సినిమాలూ మళ్ళీ ఫెయిల్ అయితే తన భార్యను జాబ్ కి పంపించి భవిష్యత్తు జీవితాన్ని అలా గడిపేస్తాను అంటూ కూడా చెప్పుకున్నారు. అపజయమే ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి నోట ఫ్లాప్ మాట రావడమేంటి అన్నదే ఇపుడు అంతా అనుకుంటున్న విషయం. ఆయన తీయాలే కానీ విజయమనే లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమని అంతా గట్టిగా నమ్ముతారు. అలాంటిది  ఫ్లాప్స్ వస్తే అంటూ ఆయన మామూలుగా చెప్పినా కూడా అందరూ షాక్ అయ్యే విషయంగానే చూస్తున్నారు.

రాజమౌళి ఈ మధ్య మీడియా ముందు చెబుతున్న అనేక విషయాలను  విశ్లేషించుకుంటే ఇకపైన సుదీర్ఘంగా ఏళ్ల తరబడి సినిమాలు తీయను అని కూడా చెప్పారు. ఇపుడు ఫ్లాప్స్ వస్తే గిస్తే  అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ట్రిపుల్ ఆర్ షూటింగ్ విషయంలో ఎదురైన అనేక అవాంతరాలు రెండు సార్లు కరోనా వల్ల ఆగిన షూటింగ్, పెరిగిపోయిన నిర్మాణ వ్యయం. సరైన డేట్ మూవీ రిలీజ్ కి ఫిక్స్ కాక పలు మార్లు వాయిదా ఇలా ఇవన్నీ కూడా దర్శక  ధీరుడిని ఇబ్బంది పెట్టాయా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం. జయాపజయాలు దైవాధీనాలు. అందువల్ల ఫ్లాప్స్ రావు అని కూడా ఎవరూ చెప్పలేరు. అయితే సుదీర్ఘంగా సినిమాల షూటింగులు చేయబోను అంటూ రాజమౌళి చెప్పడం మాత్రం శుభ పరిణామమే అంటున్నారు అంతా.
Tags:    

Similar News