• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ రాజ చోర' టీజర్...

రాజ రాజ చోర' టీజర్ అప్డేట్: గంగవ్వ చెప్పిన శ్రీ విష్ణు 'చోర గాధ'

By - Tupaki Desk
Update: 2021-06-11 11:36 GMT
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు.. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ''రాజ రాజ చోర‌'' అనే ఆసక్తికరమైన సినిమాతో వస్తున్నాడు శ్రీవిష్ణు. మేఘా ఆకాశ్ - సున‌య‌న హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ ఈ ఎంటర్టైనర్ ని హ‌సిత్ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మేకర్స్.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణు ను చూపించి అంచనాలు కలిగించారు. అయితే ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత‌కాలంగా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో 'రాజ రాజ చోర‌' టీజర్ అప్డేట్ ఇచ్చారు.

బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్ తో 'చోర గాధ' అంటూ ఓ చిన్న 2డీ యానిమేషన్ వీడియోను రిలీజ్ చేశారు. నీకు ఊ కొట్టే కథ చెబుతా.. నేను ఏది చెప్పినా తిరిగి ప్రశ్నలు అడగకుండా ఊకొట్టాలి అంటూ ఓ చిన్న పిల్లాడికి గంగవ్వ ఆకర్షణీయమైన కథను వివరిస్తోంది. ''అనగనగా.. భూమి నుంచి కోతి వచ్చింది.. బంగారం వచ్చింది. కోతి మనిషి అయ్యింది.. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యిండు.. కిరీటం రాజు అయింది..'' అంటూ ఆహ్లాదకరమైన 'రాజు - దొంగ' కథ చెప్పింది గంగవ్వ. అయితే రాజు కిరీటాన్ని దొంగ ఎత్తుకెళ్లిన తర్వాత ఏమి జరిగింది.. రాజు ఏమి చేసాడు.. దొంగ దొరికాడా లేదా అంటూ చెప్పిన గంగవ్వ.. 'రాజ రాజ చోర‌' టీజర్ జూన్ 18న రాబోతున్నట్లు తెలిసేలా చేసింది. అసలు రాజు - దొంగ కథ ఏంటి? కిరీటం సంగతి ఏంటి అనేది టీజర్ లో చెప్పనున్నారు.

కాగా, 'రాజ రాజ చోర‌' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ మరియు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాలపై టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల స‌హ నిర్మాతగా.. కీర్తి చౌద‌రి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో తనికెళ్ళ భరణి - రవిబాబు - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.



Full View
Tags:    
  • Srivishnu 
  • Rajarajachora 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS