'ఒరేయ్ బుజ్జిగా' మరొకటి రెడీ
రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందిన ఒరేయ్ బుజ్జిగా లాక్ డౌన్ కారణంగా ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ను ఎంటర్ టైన్ చేసే అంశాలు బాగున్నాయంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఒరేయ్ బుజ్జిగా సినిమాతో దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరియు హీరో రాజ్ తరుణ్ ల కెరీర్ గాడిలో పడ్డట్లయ్యింది.
ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదలకు ముందే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 24న లాంచనంగా ప్రారంభం అయిన ఆ సినిమా ఈ లాక్ డౌన్ లోనే దాదాపుగా పూర్తి అయ్యిందట. ఈ ఏడాది చివరి వరకు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయాలని చూస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ ముందే వచ్చే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజ్ తరుణ్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.