• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాస్టింగ్ కౌచ్: కొత్త...

కాస్టింగ్ కౌచ్: కొత్త వాళ్లకు తప్పదు

By - Tupaki Desk
Update: 2018-08-01 10:54 GMT
సినిమా లేడీ సెలెబ్రెటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు .. మీడియా ప్రతినిధులు అడిగే మొదటి ప్రశ్న కాస్టింగ్ కౌచ్ గురించే.. ఈ మధ్య హీరోయిన్ రాయి లక్ష్మీకి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె సంచలన విషయాలను చెప్పుకొచ్చింది.

రాయ్ లక్ష్మీ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను విలేకరులకు వివరించింది.  ‘‘కాస్టింగ్ కౌచ్ అనేది కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లకు ఎదురయ్యే మొదటి సమస్య.  కొత్త వారికి అవకాశాల పేరుతో అశ చూపి లొంగదీసుకుంటున్నారు. అది ఇవ్వడమా..? లేక సినిమా వదలుకోవడమా అన్న రీతిలో వ్యవహరిస్తుండడంతో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది’’. అని తెలిపింది.

అయితే కాస్టింగ్ కౌచ్ విషయంలో  తనకు కూడా మొదట్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని.. కానీ ఏనాడు వాటికి లొంగిపోలేదని రాయ్ లక్ష్మీ వివరణ ఇచ్చింది. ఇక శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందించమని రాయ్ లక్ష్మీని కోరగా.. ‘మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె ఎలుగెత్తి చాటుతోంది. ఆమె ఒక బాధితురాలు కావడంతో ఇండస్ట్రీలోని దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తోంది’ అంటూ వివరణ ఇచ్చింది.
Tags:    
  • Rai Laxmi 
  • Casting couch 
  • Film Industry 

Similar News

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS