• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎట్టకేలకు గుమ్మడికాయ...

ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టారు.. మరో 3 రోజుల్లో 'రాధేశ్యామ్‌' అప్డేట్..!

By - Tupaki Desk
Update: 2021-07-29 08:08 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. కె.రాధాకృష్ణ కుమార్‌ ఈ వింటేజ్‌ ప్రేమకథకు దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి ఇటలీ బీబ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణ గా పూజా కనిపించనున్నారు. 2018లోనే అధికారికంగా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ అనేక కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత కరోనా ప్రభావం పడటంతో షూటింగ్ డిలే అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్‌ లో ప్యాచ్ వర్క్ షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''రాధే శ్యామ్ చివరి షెడ్యూల్‌ తో అన్నీ పూర్తయ్యాయి. మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ నా ప్రేమను వ్యాప్తి చేశాను. ఈ మహమ్మారి మా అంచనాలన్నింటినీ దెబ్బతీసింది. మూడు రోజుల్లో అప్డేట్ రాబోతోంది. వేచి చూడండి'' అని దర్శకుడు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో 'రాధేశ్యామ్‌' టీమ్‌ షూటింగ్ పూర్తి చేశామని చెబుతూ కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా.. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అప్డేట్స్ కూడా వస్తున్నందుకు ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కృష్ణంరాజు సమర్పణలో టీ - సిరీస్ - యూవీ క్రియేషన్స్ - గీతాకృష్ణ బ్యానర్స్ కలసి 'రాధే శ్యామ్' చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - ప్రశీద సంయుక్తంగా భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు శరవేగంగా జరిపి విడుదలకు సిద్ధం చేయనున్నారు. ప్రభాస్ కెరీర్ లో వస్తున్న ఈ 20వ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే 'సర్కారు వారి పాట' 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ లతో 'రాధే శ్యామ్' పోటీ పడాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో రానున్న అప్డేట్ తో విడుదల తేదీపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

'రాధే శ్యామ్' చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా.. హిందీ వెర్షన్ కు మిథున్ - మనన్ భరద్వాజ్ కలసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ - జగపతిబాబు - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇకపోతే 'రాధే శ్యామ్' షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్.. 'సలార్' 'ఆదిపురుష్' సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ - లక్ష్మణుడిగా యువ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. టీ- సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా 'సలార్' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Tags:    
  • Radheshyam 
  • Prabhas 
  • Movies 
  • Latest news 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS