'రాధేశ్యామ్‌' అసలు సందడి ఇకపై మొదలు

Update: 2020-10-16 11:30 GMT
ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్‌' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం యూరప్‌ లో జరుగుతుంది. ఇదే సమయంలో ఈనెల 23వ తారీకున ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా టీజర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సర్‌ ప్రైజ్‌ అయ్యే విధంగా టీజర్‌ ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ప్రభాస్‌ తో పాటు పూజా హెగ్డే ను కూడా టీజర్‌ లో చూపించబోతున్నారని.. 1980 బ్యాక్‌ డ్రాప్‌ అవ్వడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారంటూ అంచనాలు పెంచేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ఆ తర్వాత నటించబోతున్న సినిమాల్లో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న మూవీ ఏది అంటే ఠక్కున అంతా కూడా ఆదిపురుష్‌ అంటారు. ఆ తర్వాత మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ అంటారు. ఎందుకంటే దీపిక మరియు అమితాబ్‌ లు ఆ సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాల తర్వాత రాధేశ్యామ్‌ గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈనెల 23 తర్వాత రాధేశ్యామ్‌ టీజర్‌ చూసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఆదిపురుష్‌ స్థాయిలో రాధేశ్యామ్‌ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రాధేశ్యామ్‌ అంచనాలను పది రెట్లు పెంచేలా టీజర్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను మరియు అభిమానులను కూడా రాధేశ్యామ్‌ టీజర్‌ కట్టిపడేసి సినిమా కోసం వెయిట్‌ చేసేలా చేస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా యూవీ క్రియేషన్స్‌ వారు ప్లాన్‌ చేస్తున్నారు. 
Tags:    

Similar News