దుమారం: బిగ్ బాస్ లోకి ఆధ్యాత్మిక గురువు ‘రాధేమా’
గల్లీకో బాబాజీలు, స్వామీజీలు పుట్టుకొస్తున్న సమయం ఇదీ. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ బాబాలు, సన్యాసులు, ఆధ్యాత్మిక గురువులకు ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చిపడింది. ఈ క్రమంలోనే వారికి డిమాండ్ ఏర్పడింది.
ఇక తనను తాను దేవీ అవతారంగా ప్రచారం చేసుకునే ‘రాధేమా’తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా మాదిరిగానే రాదేమా కూడా భక్తుల మధ్య పలు విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
ఈ క్రమంలోనే రాధేమా సంప్రదాయాలు తుంగలో తొక్కుతూ తను ఒక సన్యాసి, దేవీ అవతారంగా చెప్పుకుంటున్న ఆవిడ.. సడన్ గా హిందుత్వ వాదులు వ్యతిరేకించే ‘బిగ్ బాస్ 14’ ప్రత్యక్షం కావడం దుమారం రేపింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక ఆధ్యాత్మిక గురువు బిగ్ బాస్ లో ఎంట్రీ కావడం చర్చనీయాంశంగా మారింది.
రాధేమా తీరుపై అఖిల భారత ఆఖారా పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అసలు సన్యాసిని కాదని స్పష్టం చేసింది. ఆమెకు ఏ ఆఖారాతో సంబంధం లేదని.. మతం, స్మృతులపై ఆమెకు ఏమాత్రం అవగాహన లేదని.. ఆమెను వెలివేస్తున్నట్టు ఆఖారా పరిషత్ సంచలన ప్రకటన చేసింది.
ఇక రాధేమా బిగ్ బాస్ లోకి వెళ్లడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరును తప్పుపడుతున్నారు.