ఐఏఎస్‌ కావాలనుకున్న హీరోయిన్‌.. 17 ఏళ్లకే బ్రేకప్‌

Update: 2020-11-30 09:50 GMT
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు వరుసగా తెలుగులో యంగ్‌ హీరోలకు జోడీగా నటిస్తూ వస్తుంది. ఆశించిన స్థాయిలో సూపర్‌ హిట్‌ లు పడక పోవడం వల్ల ఈమెకు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే ఆఫర్లు రావడం లేదు. ఎన్టీఆర్‌ తో జై లవకుశ సినిమాలో నటించినా దాని మూలాన మరికొన్ని పెద్ద సినిమాల ఆఫర్లు మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా చిట్‌ చాట్‌ లో రాశిఖన్నా ఆసక్తికర విషయాలను తెలియజేసింది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన తాను చిన్నప్పటి నుండి చదువులపై ఆసక్తిని కలిగి ఉన్నాను. ఆ ఆసక్తితో టాప్‌ లో కొనసాగేదాన్ని. ఐఏఎస్‌ కావాలనే కోరికతో ఒకానొక సమయంలో పుస్తకాల పురుగులా మారాను. చాలా చదివాను. కాని నా ఆలోచన ఆ తర్వాత తర్వాత మారింది. నాకు 17 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఒక సీనియర్‌ వచ్చి ప్రపోజ్‌ చేశాడు. కొన్నాళ్ల పాటు అతడితో ట్రాక్‌ నడిచింది. కాని చాలా తక్కువ సమయంలోనే అతడితో బ్రేకప్‌ అయ్యిందని రాశిఖన్నా చెప్పుకొచ్చింది.

ఎక్కువగా పుస్తకాలు చదివిన అనుభవం ఉన్న కారణంగా అప్పుడప్పుడు సొంతంగా ఏమైనా రాయడం మొదలు పెట్టాను. అప్పుడే నాకు పాటలపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితో కొన్ని కార్యక్రమాల్లో పాటలు పాడాను. ఆ తర్వాత కెరీర్‌  అనూహ్యంగా హీరోయిన్‌ గా టర్న్‌ అయ్యింది అంటూ తన సినీ ఎంట్రీ గురించి రాశిఖన్నా చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. త్వరలో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొంది.
Tags:    

Similar News