స్టార్ హీరో సినిమాతో సమీరా రెడ్డి కంబ్యాక్!
ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్ - నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి సమీరా రెడ్డి.;
ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్ - నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి సమీరా రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో నటించిన సమీరా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సమీరా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఓ స్టార్ హీరో సినిమాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ముగిశాని తెలిసింది.
ఇందులో ఆమె ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. గతంలో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా అలరించిన సమీరా ఇప్పుడు వయస్సు , అనుభవానికి తగ్గట్టుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఓ మలుపుగా నిలుస్తుందని భావిస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో సమీరా రెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం టచ్‌లోనే ఉంది. బాడీ పాజిటివిటీ, మాతృత్వం , ఫిట్‌నెస్ పై సమీరా పంచుకున్న వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది.
సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులను ధైర్యంగా పంచుకోవడం తో ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు నేరుగా వెండితెరపై ఆమెను చూడబోతున్నామన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా సీనియర్ హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఎలాంటి పాత్రలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సమీరా రెడ్డి కూడా పేరు కోసం కాకుండా కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర అయితేనే నటించాలని నిర్ణయిం చుకుందిట. అందుకే ఓ స్టార్ హీరో ప్రాజెక్ట్ కావడంతో పాటు అందులో తన పాత్రకున్న వెయిటేజీని బట్టి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో తనలోని నటిని మరోసారి కొత్తగా ఆవిష్కరించుకోబోతుంది. సమీరా రెడ్డి రాకతో టాలీవుడ్‌లో సీనియర్ నటీమణుల జోరు మళ్ళీ పెరగనుంది. ఇప్పటికే పలువురు కథానాయికలు సెకండ్ ఇన్నింగ్స్‌లో దిగ్విజయంగా రాణిస్తున్నారు. ఈనేపథ్యంలో సమీరా కూడా అదే బాటలో సక్సెస్ సాధించాలని అభిమానులు ఆశీస్తున్నారుఉ. అయితే సమీరా రెడ్డి నటిస్తున్న ఆ స్టార్ హీరో సినిమా ఏది? అందులో ఆమె పాత్ర ఎలా ఉండ బోతోంది? అనే వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి.