వేడుక చూద్దాంకు ఓపెనింగ్స్ ఫుల్

Update: 2017-05-27 07:34 GMT
ఈ వారం కొత్తగా థియేటర్లలోకొచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లోనే టోటల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేయడం... లీడ్ పెయిర్ నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంట బాగుండటం ఈ సినిమాకు ప్లస్ పాయింటయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ఈ సినిమాకు బాగానే వస్తున్నారు.

సినిమా రిలీజైన శుక్రవారం నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. శని, ఆదివారాల్లో అడ్వాన్స్ బుకింగ్ లు పూర్తయ్యాయి. టోటల్ గా ఈ వీకెండ్ లో రారండోయ్ వేడుక చూద్దాంకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం నుంచి కలెక్షన్లు స్టడీగా ఉంటే ఈ సినిమా డీసెంట్ హిట్ అవుతుంది. కిందటి వారం రిలీజైన నిఖిల్ హీరోగా నటించిన కేశవ వీకెండ్ లో మంచి వసూళ్లే రాబట్టినా వీక్ డేస్ లో బాగా వీక్ గా నడిచింది. ఈ శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు వస్తే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేస్తుంది. ఇక శర్వానంద్ హీరోగా నటించిన రాధ పూర్తిగా డల్ అయిపోయింది.  కలెక్షన్లు అస్సలు లేవు. ఈ సినిమాను ఫ్లాప్ కేటగిరీలో లెక్క పెట్టేయొచ్చు.

విడుదలై నాలుగు వారాలైనా బాహబలికి ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. భారీ సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం బాహుబలికి కలిసొస్తోంది. దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ అయ్యేవరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News