ఈ జూలీకి మోక్షం లభిస్తుందా?

Update: 2017-08-25 16:00 GMT
కోలీవుడ్ లో హీరోయిన్ గా వెలుగులు విరజిమ్ముతూనే టాలీవుడ్ లో ఐటెం బ్యూటీగా క్రేజ్ సంపాదించేసుకుంది రాయ్ లక్ష్మీ. ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవితో చిందులు వేసి తనలోని ట్యాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేసింది కూడా. అంతకు ముందే పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఐటెం పాటలో నర్తించి మెప్పించింది రాయ్ లక్ష్మి.

అయితే ఈమెకు బాలీవుడ్ డ్రీమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈమెను బాలీవుడ్ లో గ్లామర్ డాళ్ గా ప్రెజెంట్ చేసే రేంజ్ ప్రాజెక్ట్ రావడంతో తెగ రెచ్చిపోయి అందాలను ప్రదర్శించేసింది రాయ్ లక్ష్మీ. జూలీ2 ప్రాజెక్టులో టైటిల్ రోల్ చేసే అవకాశం రావడంతో.. అందాల ప్రదర్శనలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. అయితే.. ఈ జూలీ2 చిత్రానికి సంబంధించి లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ అంటూ కొత్తగా కొన్ని ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే.. ఇప్పటికి ఏడాదిన్నర క్రితమే.. జూలీ2 ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులోనే 2016, ఆగస్ట్ 12న రిలీజ్ అని కూడా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అనేక మార్లు పోస్ట్ అవుతూ ఉండగా.. ఎప్పటికప్పుడు రాయ్ లక్ష్మీ కొత్త ఫోటోలతో ఈ సినిమాను వార్తల్లో నిలిపేందుకు కష్టపడుతూనే ఉంది.

రిలీజ్ కి షెడ్యూల్ చేసిన డేట్ దాటి ఏడాది గడిచాక కూడా ఇంకా షూటింగ్ జరుపుకుంటోందంటే కామెడీ అనిపించక మానదు. పైగా ఇదేమీ యాక్షన్ మూవీ.. గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ ఫిలిమ్ కాదు. మరి ఇంత ఆలస్యం ఎందుకు అవుతోందో.. ఇండస్ట్రీలో రెండున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దర్శకుడు దీపక్ శివదాసాని మాత్రమే చెప్పగలగాలి.


Tags:    

Similar News