#పుష్ప‌.. కాశీ వార‌ణాసిలో ఎర్ర‌చంద‌నం దొంగ‌?

Update: 2020-11-30 04:15 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని మారేడుమిల్లి అడ‌వుల్లో షెడ్యూల్ జ‌రుగుతోంది. అక్క‌డి నుంచి బ‌న్ని ఫోటోలు సోష‌ల్ మీడియాల్లో రివీలైన సంగ‌తి తెలిసిందే.

ఈ షెడ్యూల్ త‌ర్వాత వార‌ణాసి షెడ్యూల్ ఫిక్స‌య్యింది. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ఒక పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. వారణాసిలో పుష్ప‌పై సాంగ్ చిత్రీక‌ర‌ణ ఏమిటి? అన్న సందేహం క‌ల‌గొచ్చు. మ‌రి ఎర్ర‌చంద‌నం దుంగ‌లు త‌ర‌లించే డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ కు కాశీ వార‌ణాసి క‌నెక్ష‌న్ ఏమిట‌న్న‌ది సుక్కూనే చెప్పాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే షూటింగ్ ప‌లుమార్లు వాయిదా ప‌డిన సంద‌ర్భంగా ఏదీ డిలే కాకుండా సుకుమార్ శ‌ర‌వేగంగా సినిమాని పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాడు.. మారేడు మిల్లి అడ‌వుల్లో కీల‌క షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న గిరిజ‌న యువ‌తిగా న‌టిస్తుండ‌గా.. హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా హాట్ ఐటెమ్ నంబ‌ర్ లో న‌ర్తించ‌నుంది. బ‌న్ని-సుక్కూ కాంబోకి ల‌క్కీ ఛామ్ అయిన‌ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Tags:    

Similar News